iDreamPost

Ishan Kishan: ఆ తప్పు కారణంగా ఇషాన్ ను జట్టు నుంచి తీసేసిన BCCI?

అందరూ ఇషాన్ కిషన్ మానసిక ఒత్తిడి కారణంగా విశ్రాంతి తీసుకున్నాడని అనుకుంటున్నారు. కానీ తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇషాన్ చేసిన రెండు తప్పుల కారణంగా అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. మరి ఇషాన్ కిషన్ చేసిన ఆ మిస్టేక్స్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం

అందరూ ఇషాన్ కిషన్ మానసిక ఒత్తిడి కారణంగా విశ్రాంతి తీసుకున్నాడని అనుకుంటున్నారు. కానీ తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇషాన్ చేసిన రెండు తప్పుల కారణంగా అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. మరి ఇషాన్ కిషన్ చేసిన ఆ మిస్టేక్స్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం

Ishan Kishan: ఆ తప్పు కారణంగా ఇషాన్ ను జట్టు నుంచి తీసేసిన BCCI?

ఇషాన్ కిషన్.. తనదైన బ్యాటింగ్ తో టీమిండియాలోకి దూసుకొచ్చాడు. అతి తక్కువ కాలంలోనే జట్టులో తన ప్లేస్ ను సుస్థిరం చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా తీరికలేకుండా మ్యాచ్ లు ఆడుతుండటంతో.. మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నానని తనకు తానే విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ తో పాటుగా ఆఫ్గాన్ తో జరగబోయే సిరీస్ కు ఇషాన్ ను పక్కనపెట్టారు సెలెక్టర్లు. అయితే అందరూ ఇషాన్ మానసిక ఒత్తిడి కారణంగా విశ్రాంతి తీసుకున్నాడని అనుకుంటున్నారు. కానీ తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇషాన్ చేసిన రెండు తప్పుల కారణంగా అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. మరి ఇషాన్ కిషన్ చేసిన ఆ మిస్టేక్స్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

గత కొంతకాలంగా తీరికలేని మ్యాచ్ లతో తాను మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోను అవుతున్నానని, అందుకే కొంత కాలం క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అతడిని సౌతాఫ్రికా, ఆఫ్గానిస్తాన్ సిరీస్ లకు ఎంపిక చేయలేదు టీమిండియా సెలెక్షన్ కమిటీ. అయితే ఇషాన్ కిషన్ ను జట్టు నుంచి తీసేయడానికి అతడు చెప్పిన కారణం కాకుండా మరో రెండు రీజన్స్ కూడా ఉన్నాయట. తాజాగా ఆ కారణాలు వెలుగులోకి వచ్చాయి. అసలు విషయం ఏంటంటే? ఇషాన్ ‘మెంటల్ ఫాటిగ్యూ’ అనే వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి.. దుబాయ్ లో ధోనితో కలిసి ఓ పార్టీలో కనిపించాడట. ఐపీఎల్ ఆక్షన్ కోసం ఇటీవల దుబాయ్ వెళ్లాడు ధోని. అక్కడ ఓ పార్టిలో ఇషాన్ కూడా పాల్గొన్నాడని సమాచారం. దీంతో బీసీసీఐ అతడిపై కోపంగా ఉందట.

ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం లేడీ క్రికెటర్ స్మృతి మంథనా, ఇషాన్ కిషన్ ఇద్దరూ కలిసి పాపులర్ షో అయిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనే షోకి వెళ్లారు. అందులో వీరిద్దరు 12.5 లక్షల రూపాయలు గెలుచుకున్నారు కూడా. అయితే ఈ షోకు వెళ్లే ముందు అతడు బీసీసీఐ పర్మిషన్ తీసుకోలేదట. సాధారణగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే ముందు బీసీసీఐ అంగీకారం తీసుకోవాలనే నిబంధనలు ఉంటాయి. దీన్ని ఇషాన్ ఉల్లంఘించాడని బీసీసీఐ అతడిపై గుర్రుగా ఉంది. ఈ రెండు కారణాలతోనే అతడిని టీ20లకు దూరంగా ఉంచిందని క్రీడా వర్గాల నుంచి వస్తున్న సమాచారం. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే బీసీసీఐ ఇషాన్ ను జట్టుకు దూరంగా ఉంచిందని కొందరు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ తో పాటుగా మరో స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ను డిసిప్లినరి యాక్షన్, సౌతాఫ్రికాతో ముగిసిన మ్యాచ్ ల్లో తప్పుడు షాట్ సెలెక్షన్ కారణంగా అతడిని కూడా జట్టులోకి తీసుకోలేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి