బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. లంకకు వస్తే అంటూ హెచ్చరించాడు.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. లంకకు వస్తే అంటూ హెచ్చరించాడు.
సాఫీగా సాగిపోతున్న వన్డే వరల్డ్ కప్-2023లో ‘టైమ్డ్ ఔట్’ అంశం పెద్ద దుమారపే రేపింది. బంగ్లాదేశ్-శ్రీలంక టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా ప్రకటించడం కాంట్రవర్సీగా మారింది. ఇన్నేళ్ల క్రికెట్ హిస్టరీలో ఇలా ఒక బ్యాటర్ ఔట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం. సాధారణంగా ఒక బ్యాట్స్‌మన్ ఔట్ అయితే నెక్స్ట్ బ్యాటర్ మూడు నిమిషాల్లోగా క్రీజులోకి వచ్చేయాలి. అయితే ఈ రూల్‌ను వరల్డ్ కప్‌లో రెండు నిమిషాలకు కుదించారు. బంగ్లాతో మ్యాచ్‌లో మాథ్యూస్ నిర్ణీత సమయంలోపే క్రీజులోకి చేరుకున్నప్పటికీ అతడి హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది. దీంతో వేరే హెల్మెట్ కోసం అడిగాడతను. అది వచ్చే సరికి సమయం అయిపోయింది.
నిర్ణీత సమయం అయిపోవడంతో మాథ్యూస్‌ను ఔట్‌గా ఇవ్వాలంటూ అంపెర్లను బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ కోరాడు. ఈ అప్పీల్ విషయంలో సీరియస్‌గానే అడుగుతున్నావా? అంటూ షకీబ్‌ను అంపైర్ అడిగాడు. ఔను, రూల్‌లో ఉంది కాబట్టే అడుగుతున్నానంటూ అతను అనడంతో మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాడు అంపైర్. ఈ డెజిజన్తో షాకైన లంక బ్యాటర్.. అప్పీల్ వెనక్కి తీసుకోవాలని షకీబ్‌ను కోరాడు. అయితే అతడు వెనక్కి తగ్గకపోవడంతో నిరాశతో గ్రౌండ్‌ను వీడాడు మాథ్యూస్. ఈ వివాదం ఇక్కడితో ఎండ్ కాలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్-శ్రీలంక ప్లేయర్లు ఒకరికొకరు షేడ్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. మ్యాచ్ తర్వాత షకీబ్ తన అప్పీల్‌ను సమర్థించుకున్నాడు. అయితే అతడిపై విమర్శలకు దిగాడు మాథ్యూస్.
పదిహేనేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో బంగ్లా లాంటి చెత్త టీమ్‌ను తాను చూడలేదని మాథ్యూస్ అన్నాడు. తాను నిర్ణీత సమయంలోపే క్రీజులోకి వచ్చేశానంటూ మ్యాచ్ ఫుటేజీ వీడియోలు, ఫొటోలను చూపించాడతను. దీంతో అంపైర్ల తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. షకీబల్ హసన్‌కు ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ‘టైమ్డ్ ఔట్’ విషయంలో బంగ్లా కెప్టెన్ వ్యవహరించిన తీరుకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. స్పోర్ట్ స్పిరిట్‌ను మరిచిన షకీబ్ గనుక లంకలో అడుగుపెడితే ఫ్యాన్స్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. ఇక్కడికి వస్తే షకీబ్‌ను రాళ్లతో సన్మానించడం ఖాయమని తీవ్ర విమర్శలు చేశాడు. మరి.. షకీబ్‌కు మాథ్యూస్ సోదరుడు మాస్ వార్నింగ్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మాక్స్ వెల్ కోసం బై రన్నర్ ఎందుకు రాలేదు? రీజన్ ఇదే!