iDreamPost

మాక్స్ వెల్ కోసం బై రన్నర్ ఎందుకు రాలేదు? రీజన్ ఇదే!

మాక్స్ వెల్ వీరోచిత పోరాటం ఆసిస్ కు మరుపురాని విజయాన్ని అందించింది. ఓ వైపు కండరాల నొప్పితో బాధపడుతూ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించి ఔరా అనిపించాడు. కానీ అతడికి బై రన్నర్ ఎందుకు రాలేదు అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీనికి గల కారణం ఏంటంటే?

మాక్స్ వెల్ వీరోచిత పోరాటం ఆసిస్ కు మరుపురాని విజయాన్ని అందించింది. ఓ వైపు కండరాల నొప్పితో బాధపడుతూ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించి ఔరా అనిపించాడు. కానీ అతడికి బై రన్నర్ ఎందుకు రాలేదు అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీనికి గల కారణం ఏంటంటే?

మాక్స్ వెల్ కోసం బై రన్నర్ ఎందుకు రాలేదు? రీజన్ ఇదే!

వన్డే ప్రపవచకప్ 2023లో సంచలన ఇన్నింగ్స్ కు తెరలేపాడు ఆసిస్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్. తన అసాధారణ ఆటతో జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. పసి కూన చేతిలో ఓటమి తప్పదేమో అని నిరాశలో మునిగిన కంగారులకు ఊపిరి ఊదాడు. విజయం పై ఏమాత్రం ఆశలు లేని తరుణంలో బరిలోకి దిగిన మాక్సి తన మెరుపు బ్యాటింగ్ తో ఆఫ్గాన్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఎవరూ ఊహించని విధంగా మాక్సీ సిక్సులు, బౌండరీలతో చెలరేగి డబుల్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. కేవలం 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో ఆసిస్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ లో తాను బ్యాటింగ్ చేసే సమయంలో తీవ్ర నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో బైరన్నర్ రాకపోవడానికి కారణం ఏంటి అని క్రికెట్ లోకం చర్చించుకుంటున్నారు. అసలు బై రన్నర్ రాకపోవడానికి కారణం ఏంటంటే?

మాక్స్ వెల్ బ్యాటింగ్ సమయంలో తీవ్రమైన కండరాల నొప్పితో గ్రౌండ్ లోనే పడిపోయాడు. కండరాలు పట్టేసి సరిగా నిలబడలేని, నడవలేని స్థితిలో ఉన్న మాక్సి ఎందుకు అలాగే బ్యాటింగ్ కొనసాగించారనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఫిజియో వచ్చి మాక్స్ వెల్ కు ఉమశమనం కలిగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మ్యాక్సి బ్యాటింగ్ చేయడం కష్టమని భావించిన ఆసిస్ ఆడం జంపను బ్యాటింగ్ కు పంపింది. కానీ మాక్సి రిటైర్డ్ హట్ గా వెళ్లేందుకు ఇష్టపడలేదు.

నొప్పి భరిస్తూ ఒంటరీ పోరాటం చేశాడు. అయితే ఆ సమయంలో బైరన్నర్ వస్తే సరిపోతుంది, కానీ ఆ వెసులుబాటును ఐసీసీ తీసేసింది. బ్యాటర్లు గాయపడినా, రన్ తీసేందుకు ఇబ్బంది పడినా బైరన్నర్ ను పెట్టుకునే అవకాశాన్ని ఐసీసీ తొలగించింది. అంతర్జాతీయ క్రికెట్ లో రన్నర్ విధానాన్ని ఎత్తి వేయాలని ఐసీసీ ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ 2011 లోనే నిర్ణయించింది. ఆట మధ్యలో ఇబ్బందులు తలెత్త కూడదని చేసిన సిఫార్స్ లను పరిగణించిన ఐసీసీ రన్నర్ విధానానికి చరమగీతం పాడింది. ఈకారణంగానే మాక్సి వెల్ కు బై రన్నర్ ను పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి