Somesekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం NTR జిల్లాకు చెందిన రావూరి యశ్వంత్ నాయుడు.. ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ తో తన జీవితాన్నే మార్చుకున్నాడు. ఆ స్మార్ట్ ఫోన్ అతడిని అంతర్జాతీయ క్రికెటర్ గా మార్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం NTR జిల్లాకు చెందిన రావూరి యశ్వంత్ నాయుడు.. ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ తో తన జీవితాన్నే మార్చుకున్నాడు. ఆ స్మార్ట్ ఫోన్ అతడిని అంతర్జాతీయ క్రికెటర్ గా మార్చింది.
Somesekhar
మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఇప్పటికే ఎంతో మంది రుజువుచేశారు. తమకున్న లోపాన్ని ఎత్తిచూపకుండా.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ ముందుకుసాగుతున్నారు కొందరు బధిర క్రికెటర్లు. అలాంటి ఓ స్టార్ క్రికెటర్ విజయగాథనే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అతడు మరెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం NTR జిల్లాకు చెందిన రావూరి యశ్వంత్ నాయుడు. ఇంటర్నేషనల్ బధిరుల క్రికెట్ లో నంబర్ వన్ బౌలర్ గా ఎదిగాడు యశ్వంత్. గంటకు 140 కిలోమిటర్ల వేగంతో బంతులు సంధిస్తూ.. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే కేవలం ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ తో తన జీవితాన్నే మార్చుకున్నాడు యశ్వంత్. ఆ స్మార్ట్ ఫోన్ అతడిని అంతర్జాతీయ క్రికెటర్ గా మార్చింది. పుట్టుకతోనే వినికిడి లోపం.. అదీకాక మాటలు రాని యశ్వంత్ నాయుడు విజయగాథ ఇది.
రావూరి యశ్వంత్ నాయుడు.. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జన్మించాడు. పుట్టుకతోనే వినికిడి లోపంతో పాటుగా మాటలు కూడా రావు ఇతడికి. పైగా ఏ కూడా సరిగ్గా చదవడం, రాయడం రాదు. దీంతో తన భావాలను పూర్తిగా సైగలతోనే వ్యక్తం చేసేవాడు. సాధారణ పాఠశాలలోనే చదివిన యశ్వంత్, ఎంతో కష్టపడి డిప్లొమా పూర్తి చేశాడు. ఇక తన టెన్త్ క్లాస్ పూర్తైన తర్వాత తల్లి బేబి ఓ స్మార్ట్ ఫోన్ కొనిచ్చింది. ఈ సంఘటన అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ ఫోన్ లో తనకు ఇష్టమైన క్రికెట్ ను చూసి ఎంతో నేర్చుకున్నాడు.
ఈ క్రమంలోనే ఆన్ లైన్ లో వచ్చిన ఓ మెసేజ్ చూసి.. 2015లో ఢిల్లిలో సెలక్షన్స్ కు వెళ్లాడు యశ్వంత్. అప్పుడే ఫస్ట్ టైమ్ బధిరుల నేషనల్ క్రికెట్ టీమ్ ఏర్పడటంతో.. అతడికి చోటు దక్కింది. అయితే ఇక్కడే యశ్వంత్ జీవితంలో ఊహించని సంఘటన ఎదురైంది. 2015లో యశ్వంత్ తండ్రి నాగేశ్వరరావు అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడికి తండ్రిలేని లోటును తల్లి బేబి చూసుకుంటూ వస్తోంది. అప్పు చేసిమరీ అతడిని మ్యాచ్ లకు పంపించేది. ఇక 20 ఏళ్ల వయసులో ఢిల్లీలో జరిగిన తొలి బధిరుల వరల్డ్ కప్ లో భారత్ తరఫున ఆడాడు. ఈ టోర్నీలో ఇండియా విజేతగా నిలిచింది.
స్వతహాగా మంచి పేసర్ అయిన యశ్వంత్ సాధారణ ఇంటర్నేషనల్ బౌలర్లతో సమానమైన స్పీడ్ తో బౌలింగ్ చేయగలడు. అతడు గంటకు 140 కి.మీ వేగంతో బంతులు సంధిస్తాడు. అతడి కెరీర్ లో ఇప్పటి వరకు 135 జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 167 వికెట్లు తీశాడు. ఇదిలా ఉండగా.. 2016లో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో గోకరాజు గంగరాజు సహకారంతో కోచింగ్ తీసుకునే అవకాశం దక్కింది. ఇక్కడే ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ నుంచి కొన్ని మెళకువలు నేర్చుకున్నాడు. యశ్వంత్ బౌలింగ్ ను మెచ్చుకున్న ఆసీస్ దిగ్గజం కొన్ని ట్రిక్స్ నేర్పించాడు. మరి తన లోపాలను అధిగమించి క్రికెట్ లో అంతర్జాతీయంగా రాణిస్తున్న యశ్వంత్ నాయుడుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.