Swetha
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను ఎవరిని కదిలించినా ఓజి జపమే చేస్తున్నారు. ఓజికి ఇప్పుడు ఆ రేంజ్ లో క్రేజ్ నడుస్తుంది. మొదటి టికెట్ ను ఏకంగా 5 లక్షలకు కొన్నారంటే పవన్ కళ్యాణ్ మీద ఉంటె అభిమానం ఏంటో అర్థంచేసుకోవచ్చు. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను ఎవరిని కదిలించినా ఓజి జపమే చేస్తున్నారు. ఓజికి ఇప్పుడు ఆ రేంజ్ లో క్రేజ్ నడుస్తుంది. మొదటి టికెట్ ను ఏకంగా 5 లక్షలకు కొన్నారంటే పవన్ కళ్యాణ్ మీద ఉంటె అభిమానం ఏంటో అర్థంచేసుకోవచ్చు. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Swetha
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను ఎవరిని కదిలించినా ఓజి జపమే చేస్తున్నారు. ఓజికి ఇప్పుడు ఆ రేంజ్ లో క్రేజ్ నడుస్తుంది. మొదటి టికెట్ ను ఏకంగా 5 లక్షలకు కొన్నారంటే పవన్ కళ్యాణ్ మీద ఉంటె అభిమానం ఏంటో అర్థంచేసుకోవచ్చు. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఓజి అంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏ వచ్చాయి. కానీ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ లో విలన్ ను ఇంట్రొడ్యూస్ చేసి సర్ప్రైజ్ చేసాడు డైరెక్టర్ సుజిత్.
ఇమ్రాన్ హష్మీని విలన్ గా తీసుకుని వచ్చి డైరెక్టర్ సుజిత్ చాలా తెలివైన ఆలోచన చేశాడని చెప్పాల్సిందే. ఇప్పటి జనరేషన్ కి ఇమ్రాన్ హష్మీ పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ కాస్త మిడ్ ఏజ్ వాళ్లకు మాత్రం ఇమ్రాన్ హష్మీ రేంజ్ ఏంటో తెలిసే ఛాన్స్ ఉంటుంది. 2003 లో ఫుట్ పాత్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఇమ్రాన్ హష్మీ. ఆ తర్వాత మర్డర్ అనే సినిమాతో ఒక్కసారిగా యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అలా 2005 లో ఆషిక్ బనాయా ఆప్నేలో తనుశ్రీ దత్తతో చేసిన సాంగ్ కోసం యూత్ అంతా థియేటర్స్ కు క్యూ కట్టారన్నది వాస్తవం.
ఆ తర్వాత గ్యాంగ్ స్టర్, అవారాపన్, వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై లాంటి భారీ హిట్స్ అందుకున్నాడు ఈ హీరో. 2010 తర్వాత ఇమ్రాన్ హష్మీ స్పీడ్ తగ్గిపోయింది. చాలా సెలెక్టివ్ గా సినిమాలు తీస్తూ ఉండేవాడు. అలా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరో.. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఓజికి పోటీగా నిలబడే కట్ అవుట్ రెగ్యులర్ గా ఉండకూడదని సుజిత్ అనుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ ఇలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ముంబై వెళ్లి మరీ సుజిత్ ఇమ్రాన్ ను ఒప్పించుకుని సినిమా కోసం సైన్ చేయించుకున్నాడు. సో ఓజి తో ఇమ్రాన్ కు డిమాండ్ పెరిగితే కనుక వరుస సినిమాలు క్యూ కట్టడం ఖాయం. ఇక రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.