Swetha
పవన్ కళ్యాణ్ బర్త్ డే సంధర్బంగా ఓజి నుంచి అప్డేట్స్ వస్తాయి అనుకుంటే.. దానికి ఒకరోజు ముందే ఎవరు ఊహించని విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు డేట్స్ ఇచ్చేస్తున్నాడు. దీనితో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ బర్త్ డే సంధర్బంగా ఓజి నుంచి అప్డేట్స్ వస్తాయి అనుకుంటే.. దానికి ఒకరోజు ముందే ఎవరు ఊహించని విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు డేట్స్ ఇచ్చేస్తున్నాడు. దీనితో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పైగా గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. దీనితో సినిమా మీద అంచనాలు ఒకింత ఎక్కువగానే ఉన్నాయి.
ఇక ఇప్పుడు ప్రస్తుతం ఓజి ఫీవర్ లో ఉన్న అభిమానులకు.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన అప్డేట్ కూడా కిక్ ఇస్తుంది. అదేంటంటే ఈ శనివారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. పవన్ కళ్యాణ్ పై జరిగే సాంగ్స్ అన్ని ఈ షెడ్యూల్ లో కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సాంగ్స్ కోసం దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ తో ట్యూన్స్ రెడీ చేసాడట. సినిమా మొత్తాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపే ప్రయత్నం చేస్తున్నాడట దర్శకుడు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.