iDreamPost
android-app
ios-app

అనుపమ మెప్పించలేకపోయింది.. మరి అనుష్క ?

  • Published Sep 04, 2025 | 11:29 AM Updated Updated Sep 04, 2025 | 11:29 AM

ఏదైనా సినిమా వస్తుందంటే ముందు మనకి గుర్తొచ్చేది సినిమాలో హీరో. హీరో ఇమేజ్ ను చూసుకుని ప్రమోషన్స్ అదరగొట్టేస్తూ ఉంటారు. ఇక సినిమాలో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోల్ కు మాత్రమే పరిమితం అన్నట్లుగా మారిపోయింది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్స్ ఒక స్టెప్ ముందుకు వేసి లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు.

ఏదైనా సినిమా వస్తుందంటే ముందు మనకి గుర్తొచ్చేది సినిమాలో హీరో. హీరో ఇమేజ్ ను చూసుకుని ప్రమోషన్స్ అదరగొట్టేస్తూ ఉంటారు. ఇక సినిమాలో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోల్ కు మాత్రమే పరిమితం అన్నట్లుగా మారిపోయింది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్స్ ఒక స్టెప్ ముందుకు వేసి లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు.

  • Published Sep 04, 2025 | 11:29 AMUpdated Sep 04, 2025 | 11:29 AM
అనుపమ మెప్పించలేకపోయింది.. మరి అనుష్క ?

ఏదైనా సినిమా వస్తుందంటే ముందు మనకి గుర్తొచ్చేది సినిమాలో హీరో. హీరో ఇమేజ్ ను చూసుకుని ప్రమోషన్స్ అదరగొట్టేస్తూ ఉంటారు. ఇక సినిమాలో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోల్ కు మాత్రమే పరిమితం అన్నట్లుగా మారిపోయింది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్స్ ఒక స్టెప్ ముందుకు వేసి లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఎప్పటిలానే వాటికి సరైన ఆదరణ లభించకపోవడంతో పెద్దగా ఆశ్చర్యపరిచే విషయంలా కనిపించడం లేదు. అయితే గతంలో అరుంధతి లాంటి సినిమాలతో అనుష్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాణం పోసిన మాట నిజమే. కానీ ఆ ఫార్ములా ప్రతిసారి ప్రతి ఒక్కరికి వర్క్ అవుట్ అవుతుందా అంటే.. అది కాస్త కష్టమని చెప్పాలి.

ఇలాంటి సినిమాలకు కథలో కంటెంట్ విపరీతంగా ఉండాలి. ఎలివేషన్స్ కంటే ముందు సినిమాలో క్యారెక్టరైజేషన్ బలంగా ఉండాలి. ఇక ఎక్కడా బోర్ కొట్టించకూడదు. ఇలా అన్ని సమపాళ్లలో ఉంటే తప్ప లేడి ఓరియెంటెడ్ సినిమాలు వర్క్ అవుట్ అవ్వవు. నార్మల్ సినిమాలతో పోల్చుకుంటే ఒకింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. రీసెంట్ గా అనుపమ నటించిన పరదా మూవీ ఇలాంటి సినిమానే. అనుపమ సినిమాను ప్రోమోట్ చేయడం కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టింది. అయినాసరే ఎందుకో సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. హీరోల కోస‌మే కాదు.. హీరోయిన్ల కోసం కూడా సినిమాకు రావాలి.. వాళ్ల‌కూ విజిల్స్ ప‌డాలి’ అంటూ ప‌ర‌దా ద‌ర్శ‌కుడు త‌న ఉద్దేశ్యాన్ని బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేశాడు. అయినా సినిమా పెద్దగా సౌండ్ చేయలేకపోయింది.

ఇక ఇప్పుడు అనుష్క వంతు వచ్చింది. ఏ సినిమాకైనా ప్రమోషన్స్ చాలా కీలకం. అలాంటిది అన్ని తెలిసి ఉండి కూడా ఈ అమ్మడు కెమెరా ముందుకు రాకుండా కాల్స్ ద్వారా వినిపిస్తుంది. ఒకవేళ సినిమా హిట్ అయితే ఓకే కానీ అటు ఇటు అయితే మాత్రం ఆ నింద మోయాల్సింది స్వీటీనే. ఆల్రెడీ అనుష్క ఖాతాలో అరుంధతి భాగమతి లాంటి సోలో హిట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిపోయింది. ఒకవేళ సినిమా కనుక హిట్ అందుకుంటే.. ఇక నుంచి ఇండస్ట్రీలో కథల రూపురేఖలు మారడం ఖాయం. సో అనుష్క ఏమి చేస్తుందో ఇంకొద్ది గంటల్లో తెలిసిపోతుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.