Swetha
ఈ మధ్య కాలంలో అల్లరినరేష్ నుంచి వచ్చే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఇక ఇప్పుడు అల్లరినరేష్ నుంచి మరో సినిమా రానుంది. రీసెంట్ గా దానికి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసారి కొత్త సంవత్సరం అల్లరి నరేష్ తోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే జనవరి 1 న "ఆల్కహాల్" అనే సినిమాతో న్యూ ఇయర్ ను స్టార్ట్ చేయనున్నాడు అల్లరి నరేష్.

ఈ మధ్య కాలంలో అల్లరినరేష్ నుంచి వచ్చే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఇక ఇప్పుడు అల్లరినరేష్ నుంచి మరో సినిమా రానుంది. రీసెంట్ గా దానికి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసారి కొత్త సంవత్సరం అల్లరి నరేష్ తోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే జనవరి 1 న “ఆల్కహాల్” అనే సినిమాతో న్యూ ఇయర్ ను స్టార్ట్ చేయనున్నాడు అల్లరి నరేష్. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించబోతోంది. సాధారణంగా ఈ మధ్య కాలంలో జనవరి 1 రిలీజ్ డేట్స్ ను ఎవరు చూస్ చేసుకోవడం లేదు. ఎందుకంటే అప్పుడు సినిమా రిలీజ్ చేస్తే రెండు వారాలు మాత్రమే రన్ ఉంటుంది.
కానీ అవన్నీ తెలిసి కూడా సితార ఎంటెర్టైమెంట్స్ రిస్క్ తీసుకుంటుంది. ఇక ఆల్కహాల్ సినిమా టీజర్ విషయానికొస్తే.. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు అసలు మందు అలవాటే ఉండదు. తాగితే జీవితాలు నాశనం అయిపోతాయని నమ్ముతాడు. కానీ ఇతనికి ఓ విచిత్రమైన అలవాటు ఉంది. ఫ్రెండ్స్ కి మాత్రం పార్టీ ఇస్తూనే ఉంటాడు. ఒకవేళ తానూ ఆఫర్ చేసిన తర్వాత తాగకపోతే కొట్టడం చంపుతానని బెదిరించడం లాంటివి చేస్తూ ఉంటాడు. అసలు దాని వెనుక కథ ఏమై ఉంటుంది.. అల్లరినరేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
అసలు అల్లరి నరేష్ అంటే అందరికి గుర్తొచ్చేది కామిడి. కానీ గత కొంతకాలంగా అల్లరినరేష్ సీరియస్ కథలకు షిఫ్ట్ అయ్యాడు. అయితే ఇవి అల్లరినరేష్ కు పెద్దగా కలిసి రావడం లేదని చెప్పొచ్చు. దీనితో మళ్ళీ కామిడి జోనర్ లోకి వచ్చేసి ఆ ఒక్కటి అడక్కు సినిమాను తీసాడు. కానీ ప్రేక్షకులు దీనిని పెద్దగా ఆదరించలేదు. అందుకే ఇప్పుడు గేర్ మార్చి స్టైలిష్ కామిడి ఫన్ వైపుకి వచ్చాడు. ఈ సినిమాకు మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసారి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.