Little Hearts Movie Review In Telugu: ఈటివి విన్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన మొదటి థియేట్రికల్ సినిమా ఇది. సినిమాలో భారీ క్యాస్టింగ్ లేకపోయినా సరే సినిమా మీద కాస్త ఇంట్రెస్టింగ్ బజ్ ఏ ఏర్పడింది. ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. మరి ఈ లిటిల్ హార్ట్స్ ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూసేద్దాం.
Little Hearts Movie Review In Telugu: ఈటివి విన్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన మొదటి థియేట్రికల్ సినిమా ఇది. సినిమాలో భారీ క్యాస్టింగ్ లేకపోయినా సరే సినిమా మీద కాస్త ఇంట్రెస్టింగ్ బజ్ ఏ ఏర్పడింది. ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. మరి ఈ లిటిల్ హార్ట్స్ ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మౌళి హీరోగా నటించిన మూవీ లిటిల్ హార్ట్స్. ఈటివి విన్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన మొదటి థియేట్రికల్ సినిమా ఇది. సినిమాలో భారీ క్యాస్టింగ్ లేకపోయినా సరే సినిమా మీద కాస్త ఇంట్రెస్టింగ్ బజ్ ఏ ఏర్పడింది. ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
సినిమాలో హీరో చదువుపై పెద్దగా ద్రుష్టి పెట్టేవాడు కాదు. దానివలన ఎంసెట్ లో కూడా ర్యాంక్ రాదు. దీనితో తండ్రి గోపాలరావు( రాజీవ్ కనకాల) అతనిని లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపిస్తాడు. అటు హీరోయిన్ ది కూడా అదే కథ. ఆమె పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ కావడంతో కూతురిని కూడా డాక్టర్ లా చూడాలనేది వారి కల. అందుకే ఆమెను కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ చేస్తారు. అక్కడే ఇద్దరికీ పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో హీరోయిన్ సంబందించిన ఓ ఇంపార్టెంట్ విషయం బయటపడుతుంది. అదేంటి ? ఆ తర్వాత వీరి ప్రేమాయణం ఎక్కడ వరకు కొనసాగింది ? ఈ జర్నీలో వీరికి ఎదురైన సమస్యలు ఏంటి ? చివరికి ఏమి జరిగింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు, టెక్నీకల్ పని తీరు :
మౌళి వయసుకు తగిన పాత్ర కాబట్టి సినిమాలో చాలా అలవోకగా చేసేసాడు. సోషల్ మీడియాలోను , వెబ్ సిరీస్ లలోను ఎలాంటి కామిడి అయితే పండించాడో.. దానికి ఏ మాత్రం తీసిపోకుండా వెండితెరపై కూడా ఒకింత ఎక్కువ నవ్వులే పూయించాడు. అలాగే లవ్ సీన్స్ లోను తన నటన ప్రతిభను చూపించాడు. ఇక హీరోయిన్ శివానీ నాగారం కూడా ఇదే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించింది. ఇలాంటి ఓ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకున్నందుకు ఈమెను మెచ్చుకోవలసిందే. అలాగే హీరో తండ్రిగా నటించిన రాజీవ్ కనకాల ఎప్పటిలానే టిపికల్ ఇండియన్ ఫాదర్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. మిగిలిన నటి నటులంతా కూడా తమ పరిధి మేర తెర మీద అలరించి.. ప్రేక్షకులను మెప్పించారు.
టెక్నీకల్ విభాగం విషయానికొస్తే.. ఈ మ్యాటర్ లో సినిమాలో ఎక్కడా కూడా ఎలాంటి లోటు పాట్లు జరగలేదు. సినిమాలో కథతో పాటు సాంగ్స్ కూడా అంతే హైలెట్ అయ్యాయి. ఓ పక్క నవ్విస్తూనే మరో పక్క కథకు సింక్ అవుతూ ఉన్నట్టు ఉన్నాయి. సినిమా మొత్తం చక్కగా నవ్విస్తూ సాగిపోతూ ఉంటుంది. తెలిసిన కథ అయినా సరే దానిని నీట్ గా ప్రెసెంట్ చేయడంలో.. డైరెక్టర్ సాయి మార్తాండ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
విశ్లేషణ :
ప్రతి ఒక్కరికి స్కూల్ లోనో , కాలేజ్ లోనో ఓ లవ్ స్టోరీ ఉంటూనే ఉంటుంది. పైగా ఇలాంటివి ప్రతి సినిమాలోనూ చూపిస్తూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ దర్శకుడు స్కూల్ , కాలేజ్ క్యాంపస్ దాటి బయటకు వచ్చి కోచింగ్ సెంటర్ లో ఈ ప్రేమ కథను స్టార్ట్ చేసాడు. ట్రైలర్ చూపించినట్టే అమ్మాయి అబ్బాయి మధ్యలోనే ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. సింపుల్ గా అనిపించినా రెండున్నర గంటలసేపు సేపు హాయిగా నవ్విస్తుంది. ప్రతి ఒక్కరికి కాలేజ్ డేస్ ను గుర్తుచేస్తుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ , వాళ్ళ క్యారెక్టర్స్ బిల్డ్ చేయడం చుట్టూ సాగుతూ ఉంటుంది. హీరోకి ఆల్రెడీ ఓ లవ్ స్టోరీ ఉన్నా హీరోయిన్ ను పడేయడం కోసం నానా తంటాలు పడుతూ ఉంటాడు. అలా పేరెంట్స్ పిల్లల మధ్య కామిడితో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది..
ఇక సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథ కాస్త సీరియస్ గా ఉంటుంది అనుకుంటే పొరపాటే. మొదటి హాఫ్ ని మించిన కామిడి సెకండ్ హాఫ్ లో పండించాడు దర్శకుడు. నాన్ స్టాప్ గా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. హీరోయిన్ కోసం హీరో చేసే పనులు అవి ఇంట్లో తెలిసిపోవడం.. పేరెంట్స్ హీరోకు క్లాస్ తీసుకోవడం.. హీరోయిన్ చుట్టూ జరిగే సీన్స్ , సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కటి నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. ఓ చిన్న ట్విస్ట్ తో హీరోయిన్ గురించిన కొన్ని నిజాలు బయటపడడం.. ఆ తర్వాత కథ మలుపు తిరగడంతో సెకండ్ ఆఫ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. పేరుకు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అయినా ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్ కు వెళ్లి కడుపుబ్బా నవ్వుకుని తిరిగి వచ్చే విధంగా దర్శకుడు కథను రాసుకున్నాడు.
ప్లస్ లు :
సినిమాట్రోగ్రఫీ
నటీ నటులు
కథ
కామిడి
మైనస్ లు :
ఊహలకు అందే సీన్స్ (కొన్ని)
రిపీటెడ్ కామిడి సీన్స్(అక్కడక్కడ)
రేటింగ్ : 2.5/5
చివరిగా : లిటిల్ హార్ట్స్ డీసెంట్ , సింపుల్ కామిడి ఎంటర్టైనర్