iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా కొత్త రికార్డ్స్ ను సెట్ చేస్తున్న కొత్త లోక

  • Published Sep 03, 2025 | 4:49 PM Updated Updated Sep 03, 2025 | 4:49 PM

కొన్ని సినిమాలు అసలు ఎలాంటి బజ్ లేకుండా థియేటర్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. పైగా ఇతర భాషల సినిమాలు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సైలెంట్ గానే విధ్వంసం సృష్టిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు రీసెంట్ గా థియేటర్స్ లో సందడి చేస్తున్న సినిమా కొత్త లోక. నిన్న మొన్నటివరకు పెద్దగా బజ్ ఏమి లేని ఈ సినిమా ఇప్పుడు వారం లోపే వంద కోట్లు దిశగా అడుగులు వేసింది.

  • Published Sep 03, 2025 | 4:49 PMUpdated Sep 03, 2025 | 4:49 PM
సైలెంట్ గా కొత్త రికార్డ్స్ ను సెట్ చేస్తున్న కొత్త లోక

కొన్ని సినిమాలు అసలు ఎలాంటి బజ్ లేకుండా థియేటర్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. పైగా ఇతర భాషల సినిమాలు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సైలెంట్ గానే విధ్వంసం సృష్టిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు రీసెంట్ గా థియేటర్స్ లో సందడి చేస్తున్న సినిమా కొత్త లోక. నిన్న మొన్నటివరకు పెద్దగా బజ్ ఏమి లేని ఈ సినిమా ఇప్పుడు వారం లోపే వంద కోట్లు దిశగా అడుగులు వేసింది. ఎల్ 2 ఎంపురాన్ , తుడరుమ్ లాంటి సినిమాలు కూడా ఇలానే డబ్బింగ్ రూపంలో తెలుగులోకి వచ్చి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దానికి మించిన టాక్ ఇప్పుడు ఈ కొత్త లోక సంపాదించుకుంది.

తెలుగు వెర్షన్ ఒకరోజు ఆలస్యంగా రిలీజయింది. ఇప్పటివరకు ఈ సినిమా సుమారు ఆరు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సంపాదించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇది షాకింగ్ నెంబర్ ఏ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీడియం రేంజ్ స్ట్రెయిట్ సినిమాలు ఇందులో సగం కూడా తెచ్చుకోడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఈ సినిమా దెబ్బకు దీనితో పాటు రిలీజ్ అయినా తెలుగు స్ట్రెయిట్ సినిమాలు మూగబోయాయి. అయితే ఈ సినిమా ఎంత రాబట్టాలి అనుకున్న ఈ వారం లోపే రాబట్టాలి.

ఎందుకంటే ఈ వారం ఘాటీ , లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఆ తర్వాత మిరాయ్ , కిష్కిందపురి లాంటి సినిమాలు వస్తున్నాయి. నెక్స్ట్ ఎలాగూ ఓజి ఉండనే ఉంది. సో ఈలోపు కొత్త లోక ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే అప్పటివరకు ఈ సినిమాకు ఎలాంటి కాంపిటీషన్ లేదు. పైగా ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్. ఏదేమైనా దుల్కర్ జాక్ పాట్ కొట్టాడని అనడంలో సందేహమే లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.