అనుష్క నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయింది. అందులోను లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి అనుష్క పెట్టింది పేరు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ స్వీటీ ఘాటీ లాంటి ఘాటు మూవీతో వస్తుందంటే.. ఇక అంచనాలు బాగానే పెట్టుకుంటారు ప్రేక్షకులు. మరి థియేటర్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
అనుష్క నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయింది. అందులోను లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి అనుష్క పెట్టింది పేరు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ స్వీటీ ఘాటీ లాంటి ఘాటు మూవీతో వస్తుందంటే.. ఇక అంచనాలు బాగానే పెట్టుకుంటారు ప్రేక్షకులు. మరి థియేటర్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
అనుష్క నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయింది. అందులోను లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి అనుష్క పెట్టింది పేరు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ స్వీటీ ఘాటీ లాంటి ఘాటు మూవీతో వస్తుందంటే.. ఇక అంచనాలు బాగానే పెట్టుకుంటారు ప్రేక్షకులు. రిలీజ్ కు ముందు వరకు కూడా సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గానే ఉంది. మరి థియేటర్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
ఘాటీ సినిమా కథ అంతా కూడా ఆంధ్ర, ఒడిశా బోర్డర్ లోనే కొనసాగుతూ ఉంటుంది. అక్కడ గంజాయి సాగుచేసే కొన్ని గ్రామాలూ ఉంటాయి. ఇక అక్కడ ప్రజలంతా ఇదే పని చేస్తూ ఉంటారు. కాష్టాల నాయుడు(రవీంద్ర విజయ్) , కుందుల నాయిడు(చైతన్య రావు) దగ్గర వీరంతా పని చేస్తారు. అందరిలానే విక్రమ్ ప్రభు , అనుష్క కూడా ఇదే పని చేసేవారు కానీ కొంతకాలం తర్వాత మానేసి.. వేరే పని చేసుకుంటూ బ్రతికే వారు. కానీ ఇంకొంతకాలం తర్వాత వారు తిరిగి స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ లో అనుష్క క్రిమినల్ గా మారాల్సి వస్తుంది. అసలు ఎందుకు వారు మళ్ళీ స్మగ్లింగ్ చేశారు ? అనుష్క క్రిమినల్ గా మారాడని వెనుక కారణం ఏంటి ? చివరకి ఏమైంది అనేది తెరమీద చూడాల్సిన కథ.
నటీనటుల, టెక్నీకల్ పని తీరు :
నటీనటుల విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది హీరో ఆఫ్ ది ఫిల్మ్ అనుష్క గురించే. సినిమా అంతా కంప్లీట్ గా వన్ ఉమెన్ షో అని చెప్పుకోవాల్సిందే. మాస్ ఎలిమెంట్స్ తో వచ్చే యాక్షన్ సిక్వెన్స్ లకు థియేటర్స్ లో మంచి రియాక్షన్స్ దక్కుతున్నాయి. అలాగే విక్రమ్ ప్రభు కూడా తన పరిధి మేర బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఎప్పటిలానే జగపతి బాబు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. మొదటిసారి విలన్ పాత్రలో నటించిన చైతన్య రావు తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు పెద్దగా పరిచయస్తులు కాకపోయినా వారి వారి క్యారెక్టర్స్ కు బాగానే న్యాయం చేశారు.
టెక్నీకల్ టీం విషయానికొస్తే.. ముందుకు చెప్పుకోవాల్సింది డైరెక్టర్ క్రిష్ గురించే. క్రిష్ ఘాటీతో సరికొత్త ప్రయోగం చేసి మరోసారి తన మార్క్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటివరకు క్రిష్ డైరి నుంచి వచ్చిన సినిమాలకంటే ఈ సినిమాలో కంటెంట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కువగా కమర్షియల్ అంశాల మీద ఫోకస్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్. కాకపోతే సిజి వర్క్ , ఎడిటింగ్ విషయాల మీద ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటె బావుండేదనే ఫీలింగ్ వస్తుంది. వీటితో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే వర్కౌట్ అయింది. మొత్తం మీద టెక్నీకల్ టీం తమ వర్క్ ను బాగానే చేశారు.
విశ్లేషణ:
గంజాయి, స్మగ్లింగ్ లాంటి బ్యాక్గ్రౌండ్ కథలు ఈ మధ్యకాలంలో బాగానే వచ్చాయి. బెస్ట్ ఎగ్జామ్పుల్ పుష్ప సినిమానే.. అందులో హీరో ఆ స్మగ్లింగ్ ను వాడుకుని ఓ సామ్రాజ్యాన్ని సృష్టించాలని అనుకుంటాడు. కాకపోతే ఇక్కడ హీరోయిన్ హీరో రోల్ ప్లే చేసి అలాంటి దారుణాలను ఆపాలని అనుకుంటుంది. ఇలాంటి బ్యాక్డ్రాప్ కు ఒక హీరోయిన్ ని మెయిన్ లీడ్ గా తీసుకుని కథను రాసుకోవడంలో దర్శకుడు సాహసమే చేసాడు. అనుష్క అభిమానులు అనుష్క నుంచి ఈ రేంజ్ మాస్ ఎలివేషన్స్ , యాక్షన్స్ సీన్స్ అయితే అసలు ఊహించి ఉండరు. ఈ విషయం క్రిష్ వారికి ఫుల్ మీల్స్ పెట్టేసాడు. మొదటి హాఫ్ అంతా కూడా అక్కడ జరిగే సన్నివేశాలను , కథలోని పాత్రలను పరిచయం చేయడంలోనే కథ అంతా సాగిపోతుంది.
కట్ చేస్తే రెండో పార్ట్ లో అసలు హీరోయిన్ , హీరో తిరిగి స్మగ్లింగ్ మొదలుపెట్టడం వెనుక కారణం ఏంటి.. ఆ విలన్స్ ను ఏమి చేసారు. మొదటి కాస్త స్వీట్ గా కనిపించే స్వీటీ తర్వాత అంత ఘాటుగా అంటే పక్కా మాస్ క్రిమినల్ లా మారడం వెనుక కారణాలు ఏంటి అనేది ప్లాట్ తో సెకండ్ హాఫ్ ముగించారు. కథ పరవాలేదు అనిపించుకున్న కథనం బాగా వర్కౌట్ అయింది. హై ఫీల్ ఇచ్చే మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. కాకపోతే వాటిని ఇంకాస్త ఎలివేట్ చేసి ఛాన్సెస్ ఉన్నా చేయలేదు. ఫస్ట్ ఇచ్చిన హై ఫీల్ సెకండ్ హాఫ్ లో కనిపించకపోవచ్చు. మొత్తం మీద అనుష్క మాత్రం ఈసారి మాస్ ఆడియన్స్ ను కంప్లీట్ గా శాటిస్ఫై చేసిందని చెప్పొచ్చు.
ప్లస్ లు :
అనుష్క
సినిమాటోగ్రఫీ
యాక్షన్ సీన్స్
మైనస్ లు :
సెకండ్ హాఫ్ (కొన్ని సీన్స్)
సిజి వర్క్ , ఎడిటింగ్( కొన్ని చోట్ల)
రేటింగ్ : 2.5/5
చివరిగా : స్వీటీ “ఘాటీ” తో మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా