Swetha
లోకేష్ కనగరాజ్ . రజినికాంత్ అనే కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే.. సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఎందుకంటే అటు దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులలో తన మార్క్ ను సెట్ చేసుకున్నాడు. ఇక రజినికాంత్ ను ఫ్యాన్ బేస్ సంగతి తెలియనిది కాదు
లోకేష్ కనగరాజ్ . రజినికాంత్ అనే కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే.. సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఎందుకంటే అటు దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులలో తన మార్క్ ను సెట్ చేసుకున్నాడు. ఇక రజినికాంత్ ను ఫ్యాన్ బేస్ సంగతి తెలియనిది కాదు
Swetha
లోకేష్ కనగరాజ్ . రజినికాంత్ అనే కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే.. సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఎందుకంటే అటు దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులలో తన మార్క్ ను సెట్ చేసుకున్నాడు. ఇక రజినికాంత్ ను ఫ్యాన్ బేస్ సంగతి తెలియనిది కాదు. ఇక ఇద్దరి కాంబినేషన్ అంటే ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేశారు ఆడియన్స్. అలాగే ఈ సినిమా భారీ అంచనాల మధ్యన.. భారీ ఓపెనింగ్స్ తో ఆగష్టు 14 న రిలీజ్ అయింది.
కానీ ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. ఇక ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే సాధారణంగా ఇంత పెద్ద సినిమాలు ఓటిటి లోకి రావాలంటే కనీసం రెండు నెలల సమయమైనా పడుతుంది. కానీ కూలీ మాత్రం సరిగ్గా 28 రోజుల్లో ఈ సినిమా ఓటిటి ఎంట్రీ ఇచ్చేస్తుంది. సెప్టెంబర్ 11 నుంచి కూలీ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కు రానుంది. కూలీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. హిందీ మినహాయించి మిగిలిన అన్ని భాషల్లో ఈ సినిమా వచ్చే వారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు కానీ.. పరవాలేదని అనిపించుకుంది. డైరెక్టర్ కూడా ఇది ఎల్సియు లో భాగం కాదని తేల్చి చెప్పేసాడు. సో ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమా చూస్తే మాత్రం నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్య ఎలాగూ థియేటర్ లో ఫెయిల్ అయినా సినిమాలు ఓటిటి ని రూల్ చేస్తున్నాయి. ఇక కూలీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.