iDreamPost
android-app
ios-app

బకాసుర రెస్టారెంట్ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Sep 05, 2025 | 3:45 PM Updated Updated Sep 05, 2025 | 3:45 PM

ఈ మధ్య కాలంలో థియేటర్ లో కంటే ఓటిటి లోనే ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాల టాక్ సూపర్ డూపర్ హిట్ అనుకుంటే తప్ప.. ప్రేక్షకులు థియేటర్ వరకు కదలడం లేదు. ఇది లేదంటే అది పెద్ద హీరో సినిమా అయ్యి ఉండాలి. ఈ రెండు కాకపోతే ఓటిటి లో వచ్చేంతవరకు వెయిట్ చేసి ఆ మూవీని చూస్తున్నారు ప్రేక్షకులు.

  • Published Sep 05, 2025 | 3:45 PMUpdated Sep 05, 2025 | 3:45 PM
బకాసుర రెస్టారెంట్ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఈ మధ్య కాలంలో థియేటర్ లో కంటే ఓటిటి లోనే ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాల టాక్ సూపర్ డూపర్ హిట్ అనుకుంటే తప్ప.. ప్రేక్షకులు థియేటర్ వరకు కదలడం లేదు. ఇది లేదంటే అది పెద్ద హీరో సినిమా అయ్యి ఉండాలి. ఈ రెండు కాకపోతే ఓటిటి లో వచ్చేంతవరకు వెయిట్ చేసి ఆ మూవీని చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా బకాసుర రెస్టారెంట్ ఆగస్ట్ 8న థియేటర్లో రిలీజ్ అయింది. థియేటర్ లో ఈ సినిమా పరవాలేదని అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. పరమేశ్వరన్ అనే అతను ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి ఉద్యోగం చేయడంకంటే బిజినెస్ చేయడం అంటే బాగా ఇష్టం. తనకు రెస్టారెంట్ పెట్టాలని ఉందని తన రూమ్ మేట్స్ తో ఓసారి చెప్తాడు. దానికి చాలా డబ్బులు కావాలి కాబట్టి అందుకోసం ఓ యూట్యూబ్ ఛానెల్ పెడదాం అని వారు సలహా ఇస్తారు. దీనితో వాళ్లంతా కలిసి దెయ్యం మీద మొదటి వీడియో చేస్తారు. అది కాస్త వైరల్ అవుతుంది. దానికోసం ఓ బిల్డింగ్ లోకి వెళ్తారు అక్కడ నిజంగానే బకాసుర అనే ఆత్మ బయటకు వస్తుంది. అది కాస్త పరమేశ్వరన్ ఫ్రెండ్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏమి జరింగింది ? కథ ఎలాంటి మలుపులు తీసుకుంది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హర్రర్ సినిమాలు ఈ మధ్య బాగా ఫెమస్ అయిపోయాయి. అలాంటిది ఇది హర్రర్ కామిడి సినిమా. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఓటిటి లో అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.