iDreamPost
android-app
ios-app

#SSMB 29 ఏకంగా 120 దేశాల్లో రిలీజ్

  • Published Sep 05, 2025 | 1:18 PM Updated Updated Sep 05, 2025 | 1:18 PM

అసలు సినిమాకు సంబందించిన ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాకపోయినా.. జస్ట్ కాంబినేషన్ అనౌన్సుమెంట్ తోనే ఆ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యేలా చేయడం రాజమౌళికి మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఇండస్ట్రీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి హాట్ టాపిక్ అంటే అది SSMB 29 మాత్రమే. ఈ సినిమాకు సంబంధించి వచ్చే అప్డేట్స్ చాలా రేర్

అసలు సినిమాకు సంబందించిన ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాకపోయినా.. జస్ట్ కాంబినేషన్ అనౌన్సుమెంట్ తోనే ఆ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యేలా చేయడం రాజమౌళికి మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఇండస్ట్రీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి హాట్ టాపిక్ అంటే అది SSMB 29 మాత్రమే. ఈ సినిమాకు సంబంధించి వచ్చే అప్డేట్స్ చాలా రేర్

  • Published Sep 05, 2025 | 1:18 PMUpdated Sep 05, 2025 | 1:18 PM
#SSMB 29 ఏకంగా 120 దేశాల్లో రిలీజ్

అసలు సినిమాకు సంబందించిన ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాకపోయినా.. జస్ట్ కాంబినేషన్ అనౌన్సుమెంట్ తోనే ఆ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యేలా చేయడం రాజమౌళికి మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఇండస్ట్రీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి హాట్ టాపిక్ అంటే అది SSMB 29 మాత్రమే. ఈ సినిమాకు సంబంధించి వచ్చే అప్డేట్స్ చాలా రేర్. కానీ అది సోషల్ మీడియాలో సృష్టించే విధ్వంసం మాత్రం నెక్స్ట్ లెవెల్. రీసెంట్ గా కెన్యా అడవుల్లో షూట్ గురించి వచ్చిన అప్డేట్ తెగ పాపులర్ అయిపోయింది. జక్కన్న ఎంత జాగ్రత్తగా ఉన్నా అక్కడ సెట్స్ నుంచి ఒకటి రెండు ఫొటోస్ కూడా లీక్ అయ్యాయట.

ఈ లీకుల నుంచి జక్కన్న సినిమాను ఎలా కాపాడతాడో చూడాలి. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. కెన్యాలో జరిగిన షూటింగ్ సంధర్బంగా అక్కడ ప్రభుత్వ సహకారాన్ని ధన్యవాదాలు తెలుపుతూ రాజమౌళి.. అక్కడ అక్కడ గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివని, కెన్యా మంత్రి ముసాలియా ముదావాదినితో దిగిన ఫొటోస్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముసాలియా రాజమౌళిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇండియన్ కల్చర్ ను ప్రపంచానికి చాటి చెప్పడంలో రాజమౌళిని మించిన వారు ఎవరు లేరని.. తమ దేశాన్ని ఈ షూటింగ్ కోసం సెలెక్ట్ చేయడం వారికి గర్వాంగా ఉందని చెప్పుకొచ్చారు.

వీటితో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ను కూడా షేర్ చేసుకున్నారు. SSMB 29 ను మొత్తం 120 దేశాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే రాజమౌళి కెరీర్ తో పాటు.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ నవంబర్ లో రిలీజ్ చేస్తామని రాజమౌళి అనౌన్స్ చేశారు. ఇక అది ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.