iDreamPost
android-app
ios-app

వర్షం పడినా మ్యాచ్​ రద్దవదు.. ప్రపంచంలోనే తొలి ఇండోర్ స్టేడియం! ఎక్కడంటే?

  • Published Jul 12, 2024 | 3:25 PM Updated Updated Jul 12, 2024 | 3:25 PM

All Weather Cricket Stadium: క్రికెట్​ మ్యాచ్​లకు వర్షం అడ్డంకిగా మారడం చూస్తూనే ఉంటాం. వాన కారణంగా ఎన్నో మ్యాచ్​లు రద్దయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ స్టేడియంలో మాత్రం ఈ సమస్య లేదు.

All Weather Cricket Stadium: క్రికెట్​ మ్యాచ్​లకు వర్షం అడ్డంకిగా మారడం చూస్తూనే ఉంటాం. వాన కారణంగా ఎన్నో మ్యాచ్​లు రద్దయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ స్టేడియంలో మాత్రం ఈ సమస్య లేదు.

  • Published Jul 12, 2024 | 3:25 PMUpdated Jul 12, 2024 | 3:25 PM
వర్షం పడినా మ్యాచ్​ రద్దవదు.. ప్రపంచంలోనే తొలి ఇండోర్ స్టేడియం! ఎక్కడంటే?

క్రికెట్​ మ్యాచ్​లకు వర్షం అడ్డంకిగా మారడం చూస్తూనే ఉంటాం. జెంటిల్మన్ గేమ్ అనే కాదు.. ఫుట్​బాల్, హాకీ లాంటి పలు ఔట్​డోర్ గేమ్స్​కు వరుణుడు ఆటంకం కలిగించడం కామనే. అయితే వాన వల్ల ఎక్కువగా క్రికెట్ మ్యాచ్​లు రద్దవుతుంటాయి. ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో కొన్ని మ్యాచ్​లకు రిజర్వ్‌ డే ఉంటుంది. కాబట్టి ఆ మ్యాచ్​లో రిజల్ట్ వస్తుంది. కానీ ద్వైపాక్షిక సిరీస్​లు, టెస్ట్ మ్యాచ్​లు, డొమెస్టిక్ టోర్నమెంట్స్​లో వరుణుడు మాత్రం మ్యాచ్​లకు అడ్డుపడుతూనే ఉంటాడు. వాన అనే కాదు.. ఒక్కోసారి తీవ్రమైన ఎండ, భీకరమైన గాలుల వల్ల కూడా మ్యాచ్​లు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ స్టేడియంలో మాత్రం ఈ సమస్య లేదు. వర్షం పడినా మ్యాచ్ ఆగకుండా కొత్త స్టేడియాన్ని రూపొందిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా.

ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో నయా స్టేడియం నిర్మాణానికి ఆ దేశ క్రికెట్ బోర్డు రూపకల్పన చేస్తోంది. సాధారణ స్టేడియాల్లాగే ఉన్నా దీని మీద పూర్తిగా గ్లాస్​ రూఫ్ రానుంది. ఈ రూఫ్​ను స్టీల్, టింబర్​ మిశ్రమాల కలయికతో నిర్మిస్తారు. దీని వల్ల బయట వాన పడుతున్నా గ్రౌండ్​లో మాత్రం ఒక్క చుక్క నీరు కూడా రాదు. బయటి వాతావరణంతో సంబంధం లేకుండా స్టేడియంలో మ్యాచ్​లు కంటిన్యూ అవుతాయి. వాతావరణ ఇబ్బందులతో సంబంధం లేకుండా ఎంచక్కా ఆడుకోవచ్చు. అయితే బయట నుంచి ఎండ, సహజ కాంతి స్టేడియంలోకి పడేలా ఏర్పాట్లు చేస్తారు. 23 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియాన్ని 2028లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రణాళికలు రచిస్తోంది.

క్రికెట్​లో బ్యాటర్లు భారీ షాట్లు బాదుతుండటం తెలిసిందే. కొన్ని సిక్సులు అయితే ఏకంగా 110 మీటర్ల ఎత్తులో వెళ్లి పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే టాస్మానియా స్టేడియం రూఫ్ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని రూఫ్ ఎత్తును డిసైడ్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ ఆల్ వెదర్ క్రికెట్ స్టేడియం ఐడియాను ఆస్ట్రేలియాలో కొందరు వ్యతిరేకిస్తున్నారు. స్టేడియం నిర్మిస్తున్న ప్రాంతం, దాని వల్ల పరిసర ప్రాంతాలపై పడే ప్రభావం మీద పలు విమర్శలు వస్తున్నాయి. అయినా క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఈ ప్రాజెక్ట్​ను ముందుకు తీసుకెళ్లాలని బలంగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో దీన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. మరి.. ఎలాంటి వెదర్ కండీషన్​లో అయినా మ్యాచ్​లు జరిగేలా కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తుండటంపై మీ ఒపీనియన్​ను కామెండ్ చేయండి.