SNP
VVS Laxman, Rohit Sharma, Rahul Dravid, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ చేసిన ఒక పని విషయంలో వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.. రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి ఆయన ఏమన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
VVS Laxman, Rohit Sharma, Rahul Dravid, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ చేసిన ఒక పని విషయంలో వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.. రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి ఆయన ఏమన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో యంగ్ టీమిండియాకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు వీవీఎస్ లక్ష్మణ్. టీ20 వరల్డ్ కప్ 2024తో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడం, కొత్త కోచ్‌గా ఎంపికైన గౌతమ్ గంభీర్ శ్రీలంక టూర్‌తో బాధ్యతలు తీసుకోనుండటంతో.. లక్ష్మణ్‌ను జింబాబ్వే టూర్‌కు హెడ్ కోచ్‌గా పంపింది బీసీసీఐ. నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్.. గతంలో కూడా పలు మార్లు టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్ సెలవులో ఉన్నా, రెస్ట్‌లో ఉన్నా లక్ష్మణ్ టీమిండియాకు ఆపద్బాంధవ కోచ్‌గా వ్యవహరించాడు. అయితే.. తాజాగా ఆయన టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ కెప్టెన్సీలోని భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. రెండో సారి పొట్టి ప్రపంచ కప్‌ను సాధించింది టీమిండియా. ఈ విజయంలో ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా కీలకమనే చెప్పాలి. సీనియర్లను సమన్వయం చేసుకుంటూ.. కొత్త కుర్రాళ్లను రాటుదేల్చుతూ.. అద్భుతమైన జట్టును నిర్మించి, వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ చేశాడు. ద్రవిడ్ రెండేళ్ల కష్టానికి ఫలితమే టీ20 వరల్డ్ కప్ అని చాలా మంది క్రికెట్ నిపుణులు అన్నారు.
ద్రవిడ్ కష్టాన్ని దగ్గర నుంచి చూసిన.. కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. ఆ కప్పును అందుకుని.. తీసుకొచ్చి ద్రవిడ్ చేతుల్లో పెట్టాడు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ తీసుకొచ్చి ద్రవిడ్‌కు ఇవ్వడం చాలా మంచి విషయం అని, అది ద్రవిడ్‌కు రోహిత్ ఇచ్చే గౌరవం అంటూ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. అది రోహిత్ శర్మ గొప్పతనంగా లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అంటే.. గెలుపు క్రెడిట్‌ను ద్రవిడ్‌కు కూడా సమంగా ఇవ్వడం వెనుక రోహిత్ గొప్పతనం అర్థం చేసుకోవాలని లక్ష్మణ్ పరోక్షంగా పేర్కొన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ సైతం ట్రోఫీని ద్రవిడ్‌కి ఇచ్చాడు. తొలిసారి వరల్డ్ కప్ అందుకున్న ద్రవిడ్ చిన్న పిల్లాడిలా మారిపోయి.. కప్పు పట్టుకని పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఎప్పుడూ కూల్‌గా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉండే ద్రవిడ్‌ను అలా చూసేసరికీ అంతా షాక్ అయ్యారు. వరల్డ్ కప్ విజయం ఇంత ఉత్సాహాన్ని ఇస్తుందా అని ద్రవిడ్ చూసి అనుకున్నారు. మరి రోహిత్‌పై లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
VVS Laxman said, “it was a really nice gesture from Rohit Sharma to hand over the World Cup Trophy to Rahul Dravid during the Trophy lifting celebration”. pic.twitter.com/Fgs3mZ7gVt
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024
Rahul Dravid with the World Cup trophy. 🏆
– A perfect farewell for Dravid. ❤️ pic.twitter.com/exZRY30qxo
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024