Somesekhar
ఇంగ్లండ్ పై చివరి టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 112 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ లో రేర్ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్ గా నిలిచాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ రికార్డుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇంగ్లండ్ పై చివరి టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 112 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ లో రేర్ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్ గా నిలిచాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ రికార్డుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఇంగ్లండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ప్రత్యర్థి టీమ్ ను చిత్తుచేసింది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రేర్ రికార్డును నెలకొల్పాడు. 112 ఏళ్ల టెస్ట్ క్రికెటర్ లో ఇది అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచింది. మరి ఇంతకీ ఆ రేర్ రికార్డు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇంగ్లండ్ తో తాజాగా జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఇండియాను ఓడించి, బజ్ బాల్ స్ట్రాటజీ అంటూ విర్రవీగింది. అయితే ఈ మ్యాచ్ తర్వాతే అసలైన ఆటను, బజ్ బాల్ ను ఇంగ్లండ్ కు రుచిచూపించింది భారత జట్టు. తొలి మ్యాచ్ లో ఓడిపోయి.. ఆ తర్వాత గొప్పగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో విజయకేతనం ఎగురవేసింది. చివరి మ్యాచ్ లో గెలవడం ద్వారా 112 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవ్వరి వల్ల కానీ రికార్డును సాధించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇంతకీ ఆ రేర్ ఫీట్ ఏంటంటే? టెస్ట్ క్రికెట్ సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిపోయి సిరీస్ ను కైవసం చేసుకున్న ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి అరుదైన చరిత్రను సృష్టించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిపోయి.. తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి, సిరీస్ ను కైవసం చేసుకోవడం 112 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ గా రోహిత్ శర్మ రేర్ రికార్డు సాధించాడు. గతంలో 1897-98 లో ఇలా మెుదటిసారి జరిగింది. ఆ తర్వాత 1911లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిపోయి.. 4-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత అరుదైన ఘట్టం పునరావృతం అయ్యింది. ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరి తరం కాని రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు హిట్ మ్యాన్. మరి ఈ అద్భుతమైన రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: చివరి టెస్టులో ఇంగ్లండ్ చిత్తు! టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు