iDreamPost
android-app
ios-app

ఆఫ్ఘానిస్థాన్‌ కోచ్‌గా భారత మాజీ కోచ్‌.. ఇక ఆ విషయంలో ఆఫ్ఘాన్‌కు ఎదురుండదు!

భారత జట్టుకు కోచ్‌గా చాన్నాళ్ల పాటు సేవలు అందించిన ఓ దిగ్గజం.. ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్‌ టీమ్‌కు వెళ్తున్నాడు. దీంతో ఆ విషయంలో ఆఫ్ఘాన్లకు ఎదురుండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ ఆ కోచ్‌ ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భారత జట్టుకు కోచ్‌గా చాన్నాళ్ల పాటు సేవలు అందించిన ఓ దిగ్గజం.. ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్‌ టీమ్‌కు వెళ్తున్నాడు. దీంతో ఆ విషయంలో ఆఫ్ఘాన్లకు ఎదురుండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ ఆ కోచ్‌ ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆఫ్ఘానిస్థాన్‌ కోచ్‌గా భారత మాజీ కోచ్‌.. ఇక ఆ విషయంలో ఆఫ్ఘాన్‌కు ఎదురుండదు!

క్రికెట్‌లో ఆటగాళ్లతో పాటు కోచ్‌లకు కూడా స్టార్‌ ఇమేజ్‌ ఉంటుంది. అద్భుతమైన ఆటతీరుతో లెజెండ్స్‌గా పేరొందిన పలువురు ప్లేయర్లు కోచ్‌లుగా వచ్చినప్పుడు మంచి హైప్‌ నెలకొంటుంది. అదే సమయంలో ఆటగాడిగా కాకుండా కేవలం కోచ్‌లుగా సక్సెస్‌ అయి మంచి పాపులారిటీ సంపాదించిన వారూ ఉన్నారు. అలాంటి వారిలో మాజీ క్రికెటర్‌ ఆర్‌ శ్రీధర్‌ ఒకడు. ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, లిస్ట్‌-ఏ క్రికెట్‌ ఆడిన శ్రీధర్‌.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి మాత్రం డెబ్యూ ఇవ్వలేదు. అయినా తన కోచింగ్‌ టాలెంట్‌తో గుర్తింపు సంపాదించాడు. డొమెస్టిక్‌ స్టేజ్‌ నుంచి ఇంటర్నేషనల్‌ టీమ్స్‌ వరకు అతడు కోచింగ్‌ ఇస్తూ వచ్చాడు. టీమిండియాకు ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేసిన ఈ దిగ్గజం.. ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్‌ జట్టుకు వెళ్లిపోతున్నాడు.

ఆఫ్ఘానిస్థాన్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా భారత మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. త్వరలో జరగబోయే న్యూజిలాండ్‌ సిరీస్‌తో అతడు అసిస్టెంట్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆఫ్ఘాన్‌తో శ్రీధర్‌ కాంట్రాక్ట్‌ ఎన్నాళ్లు అనేది క్లారిటీ లేదు. కానీ దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో సిరీస్‌ సిరీస్‌కు ఇంప్రూవ్‌ అవుతున్న ఆఫ్ఘానిస్థాన్‌.. శ్రీధర్‌ రాకతో ఫీల్డింగ్‌లోనూ మరింత బలంగా మారే ఛాన్స్‌ ఉంది. అతడి కోచింగ్‌లో ఆ టీమ్‌ ఇంటర్నేషనల్‌ స్టాండర్స్‌ను అందుకుంటే ఇక తిరుగుండదు. శ్రీధర్‌ అపాయింటెంట్‌పై సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ రియాక్ట్‌ అవుతున్నారు.

Former coach of Team India as Afghan coach!

కోచింగ్‌లో ఎంతో అనుభవం ఉన్న శ్రీధర్‌ రాక ఆఫ్ఘాన్‌ జట్టుకు తప్పక మేలు చేస్తుందని నెటిజన్స్‌ అంటు​న్నారు. ఇన్నాళ్లూ బౌలింగ్‌ బలంగా ఆడుతూ వచ్చిన ఆ టీమ్‌.. ఇక మీదట ఫీల్డింగ్‌ను కూడా స్ట్రెంగ్త్‌గా మార్చుకొని ప్రత్యర్థులను వణికించడం ఖాయమని చెబుతున్నారు. ఆయన కనీసం మూడేళ్లు జట్టుతో కొనసాగడం ఖాయమని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక, శ్రీధర్‌ కోచింగ్‌ కెరీర్‌ విషయానికొస్తే.. వన్డే వరల్డ్‌ కప్‌-2015 నుంచి టీ20 ప్రపంచ కప్‌-2021 వరకు భారత జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఉన్నాడతను. 2008 నుంచి 2014 వరకు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో అసిస్టెంట్‌ ఫీల్డింగ్‌, స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వర్క్‌ చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కూ పనిచేశాడు. లెఫ్టార్మ్‌ స్సిన్నర్‌ అయిన శ్రీధర్‌.. ఆఫ్ఘాన్‌ జట్టుకు బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా సేవలు అందించే అవకాశం ఉంది. మరి.. ఆర్‌ శ్రీధర్‌ రాకతో ఆఫ్ఘాన్‌ క్రికెట్‌లో ఏమేం మార్పులు వస్తాయని మీరు భావిస్తున్నారో కామెంట్‌ చేయండి.