సౌాతాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ తాను ఎందుకు అర్దాంతరంగా క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సి వచ్చిందో.. ఇన్ని సంవత్సరాల తర్వాత వెల్లడించాడు.
సౌాతాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ తాను ఎందుకు అర్దాంతరంగా క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సి వచ్చిందో.. ఇన్ని సంవత్సరాల తర్వాత వెల్లడించాడు.
AB డివిలియర్స్.. ప్రపంచ క్రికెట్లో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 14 ఏళ్ల పాటు క్రికెట్ లవర్స్ ను తన చూడముచ్చటైన షాట్లతో అలరించాడు ఈ సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్. ఇక క్రికెట్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడి.. తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ను సంపాదించున్నాడు. అయితే అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత తాను రిటైర్మెంట్ ప్రకటించడానికి గల బలమైన కారణాలను వెల్లడించాడు.
ఏబీ డివిలియర్స్.. 2004లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ డాషింగ్ బ్యాటర్, అనతి కాలంలో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు. తనదైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు. ఇక ఇండియాలో అయితే ఏబీడీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే భారత్ అతడిని ముద్దుగా ‘మిస్టర్ 360’ అని పిలుచుకుంటారు. గ్రౌండ్ నలుమూలలా అతడు కొట్టే షాట్స్ చూసి తీరాల్సిందే. ఇలాంటి ఆటగాడు అనుకోకుండా, అనూహ్యంగా తన ఆటకు వీడ్కోలు పలికాడు. డివిలియర్స్ రిటైర్మెంట్ నిర్ణయం అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. కాగా.. తాను ఎందుకు క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందో ఇన్ని సంవత్సరాల తర్వాత రివీల్ చేశాడు.
ఈ క్రమంలోనే విజ్డెన్ క్రికెట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ మాట్లాడుతూ..”నా చిన్న కొడుకు కాలి మడమ అనుకోకుండా నా లెఫ్ట్ కన్నుకు తాకింది. దీంతో నా చూపు కాస్త మందగించింది. ఈ గాయానికి ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాను. అయితే డాక్టర్లు ఇకపై ఆటకు దూరంగా ఉండమని సూచించారు. వారి సలహా మేరకు రిటైర్మెంట్ ప్రకటించాను. ఈ గాయంతోనే రెండేళ్ల పాటు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాను” అంటూ చెప్పుకొచ్చాడు ఈ డాషింగ్ బ్యాటర్. కాగా.. సౌతాఫ్రికా తరఫున తన 14 ఏళ్ల కెరీర్ లో 111 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి మెుత్తం 20,014 పరుగులు చేశాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“My youngster accidentally…”: AB De Villiers opens up on when he ‘started losing vision’, his sudden international retirement#ABdeVilliers #RCB #SouthAfrica #ABDhttps://t.co/69ydceu8My
— CricketNDTV (@CricketNDTV) December 8, 2023