iDreamPost
android-app
ios-app

వీడియో: బాల్‌ను అక్కడ పెట్టుకున్న యువకుడు.. లాక్కున్న పోలీసులు!

  • Published May 14, 2024 | 10:25 AM Updated Updated May 14, 2024 | 10:25 AM

IPL 2024, KKR: ఐపీఎల్‌లో బ్యాటర్లు కొట్టే సిక్సులు బౌండరీ లైన్‌ దాటి క్రౌడ్‌లోకి వెళ్లి పడుతున్నాయి. అలా వచ్చిన బంతిని ఓ క్రికెట్‌ ఫ్యాన్‌ దొంగిలించాలి అనుకున్నాడు. కానీ, చివరికి ఏమైందో ఇప్పుడు చూద్దాం..

IPL 2024, KKR: ఐపీఎల్‌లో బ్యాటర్లు కొట్టే సిక్సులు బౌండరీ లైన్‌ దాటి క్రౌడ్‌లోకి వెళ్లి పడుతున్నాయి. అలా వచ్చిన బంతిని ఓ క్రికెట్‌ ఫ్యాన్‌ దొంగిలించాలి అనుకున్నాడు. కానీ, చివరికి ఏమైందో ఇప్పుడు చూద్దాం..

  • Published May 14, 2024 | 10:25 AMUpdated May 14, 2024 | 10:25 AM
వీడియో: బాల్‌ను అక్కడ పెట్టుకున్న యువకుడు.. లాక్కున్న పోలీసులు!

ఐపీఎల్‌ సందర్భంగా బ్యాటర్ల హంగామా మామూలుగా లేదు. బౌలర్లను ఊచకోత కోస్తూ.. బంతులను బౌండరీలైన్‌ బయటికి పంపిస్తున్నారు. క్రౌడ్‌లోకి వెళ్లిపడుతున్న బంతులను కొంత మంది ప్రేక్షకులు ఆటగాళ్ల కంటే అద్భుతంగా క్యాచ్‌లు పడుతున్నారు. కానీ, ఓ కుర్రాడు మాత్రం.. బాల్‌ నాకు దొరికింది నేను ఇవ్వను అంటూ మొండికేశాడు. అంతటితో ఆగకుండా.. బాల్‌ను పెట్టుకోరాని చోట పెట్టుకుని దొంగతనం చేయబోయాడు. అయితే.. పోలీసులు బాల్‌ను గుర్తించడంతో.. ఆ కుర్రాడి నుంచి బాల్‌ లాక్కొని గ్రౌండ్‌లోకి విసిరారు. ఈ ఘటన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. వీడియో చాలా ఆలస్యంగా వెలుగులోని వచ్చింది.

రింకూ సింగ్‌ టీ షర్టు వేసుకున్న ఓ క్రికెట్‌ అభిమాని.. క్రౌండ్‌లోకి వచ్చిన బాల్‌ను దాచుకున్నాడు. అది కూడా ప్యాంట్‌లో పెట్టుకున్నాడు. బాల్‌ అడిగితే నాకు తెలియదంటూ పోలీసులను దాబాయించే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసులు బలవంతంగా అతని నుంచి బాల్‌ను లాక్కున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. తమ అభిమాన క్రికెటర్లు ఆడే బాల్‌ను తమ వద్దే ఉంచుకోవాలని, వీలైతే దాన్ని జీవితాంతం తమతో పాటే దాచుకోవాలని క్రికెట్‌ అభిమానులు అనుకుంటూ ఉంటారు. లక్కీ కొన్నిసార్లు క్రికెటర్లు తమ అభిమానులుకు బంతులు, క్యాప్‌లు, జెర్సీలు, షూష్‌, గ్లౌజులు ఇస్తూ ఉంటారు. అలా వాళ్లు ఇచ్చినప్పుడు తీసుకుని అభిమానులు ఫుల్‌ హ్యాపీ అవుతుంటారు.

కానీ కొన్నిసార్లు క్రికెట్‌ అభిమానులకు లక్కీగా బంతులు దొరుకుతూ ఉంటాయి. బాల్‌ పాతది అయిపోయినప్పుడు.. ఆ బాల్‌ స్టాండ్స్‌లోకి వెళ్లి తీసుకురావడం కష్టం అయితే.. ఆ బాల్‌ను వదిలేసి.. అంపైర్లు కొంత బాల్‌తో మ్యాచ్‌ కొనసాగిస్తారు. అలాంటి టైమ్‌లో కొంతమంది క్రికెట్‌ అభిమానులు ఎంతో సహసం చేసి.. ఆ బాల్‌ను తీసుకుని ఎంతో సంతోష పడతారు. అలాంటిది ఏమీ చేయని ఈ కుర్రాడు.. దొంగతనం చేసి.. బాల్‌ను తీసుకోవాలని అనుకున్నాడు. కానీ, పోలీసులు అతన్ని పట్టుకుని బాల్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అతనిపై చేయి కూడా చేసుకున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.