iDreamPost
android-app
ios-app

చెట్టుపై అభిమాని.. టీమిండియా ప్లేయర్లను భయపెట్టింది ఇతడే!

  • Published Jul 05, 2024 | 10:49 AM Updated Updated Jul 05, 2024 | 10:49 AM

వరల్ట్ విన్నింగ్ పరేడ్ లో టీమిండియా ఆటగాళ్లను భయపెట్టాడు ఓ అభిమాని. తన అభిమాన ప్లేయర్లను దగ్గర నుంచి చూడాలన్న ఉత్సాహంతో భారీ సాహసం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

వరల్ట్ విన్నింగ్ పరేడ్ లో టీమిండియా ఆటగాళ్లను భయపెట్టాడు ఓ అభిమాని. తన అభిమాన ప్లేయర్లను దగ్గర నుంచి చూడాలన్న ఉత్సాహంతో భారీ సాహసం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

చెట్టుపై అభిమాని.. టీమిండియా ప్లేయర్లను భయపెట్టింది ఇతడే!

భారతదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాట్ పట్టుకున్న ఏ పిల్లాడిని అడిగినా కానీ.. సచిన్ అవుతా.. సెహ్వాగ్ అవుతా అంటూ చెప్పుకొస్తాడు. ఇక దేశంలో టీమిండియా ఎక్కడ మ్యాచ్ లు ఆడినా.. పనికట్టుకుని మరీ స్టేడియానికి తరలివెళ్తారు అభిమానులు. మరి ఇంత క్రేజ్ ఉన్న ఇండియా వరల్డ్ కప్ సాధిస్తే.. ఎలా ఉంటుందో.. అభిమానులు నిన్న ముంబైలో చూపించారు. ప్రపంచ కప్ తో విన్నింగ్ పరేడ్ నిర్వహించగా.. లక్షల్లో వచ్చిన ఫ్యాన్స్ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. అయితే ప్లేయర్లను దగ్గరగా చూడాలనుకున్న ఓ అభిమాని భారీ సాహసం వారిని భయపెట్టింది. అసలేం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చిన టీమిండియా ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీని కలిసిన తర్వాత డైరెక్ట్ గా ముంబై చేరుకున్నారు ఆటగాళ్లు. అక్కడ సాయంత్రం 5 గంటలకు విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఈ పరేడ్ ను చూసేందుకు దాదాపు 3 లక్షల మంది అభిమానులు వచ్చారు. దాంతో ముంబై నగరం స్తంభించి పోయింది. ఇంత మంది మధ్యలో టీమిండియా ఆటగాళ్లను చూడ్డం కుదరని భావించాడో ఏమో.. ఓ అభిమాని రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఎక్కాడు.

ఓపెన్ టాప్ బస్ లో ఆటగాళ్లు వరల్డ్ కప్ తో అభివాదం చేసుకుంటూ.. ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. దాంతో చెట్టుపై ఉన్న ఆ వ్యక్తిని చూసి ఒక్కసారిగా ప్లేయర్లు భయపడ్డారు. ఆ తర్వాత అతడు ఫ్యాన్ అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వరల్డ్ కప్ లో ప్రత్యర్థులను భయపెట్టిన టీమిండియాను భయపెట్టిన ఏకైక వ్యక్తివి నువ్వే బ్రో అంటూ కొందరు కామెంట్ చేస్తే.. భారత ప్లేయర్లను దగ్గర నుంచి చూసే అదృష్టం దక్కించుకున్నావ్ అంటూ మరికొందరు రాసుకొచ్చారు. మరి తన అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఈ అభిమాని చేసిన సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş