iDreamPost
android-app
ios-app

టీమిండియా విజయోత్సవ ర్యాలీ.. ఫ్యాన్స్ కు గాయాలు!

  • Published Jul 05, 2024 | 10:19 AM Updated Updated Jul 05, 2024 | 10:48 AM

Team India Victory Parade: 13 ఏళ్ల వరల్డ్ కప్ కలను నెరవేర్చిన ప్లేయర్లకు బ్రహ్మరథం పట్టారు అభిమానులు. ఈ క్రమంలోనే ముంబైలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో లక్షల్లో అభిమానులు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో పలువురు ఫ్యాన్స్ కు గాయాలు అయ్యాయి.

Team India Victory Parade: 13 ఏళ్ల వరల్డ్ కప్ కలను నెరవేర్చిన ప్లేయర్లకు బ్రహ్మరథం పట్టారు అభిమానులు. ఈ క్రమంలోనే ముంబైలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో లక్షల్లో అభిమానులు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో పలువురు ఫ్యాన్స్ కు గాయాలు అయ్యాయి.

టీమిండియా విజయోత్సవ ర్యాలీ.. ఫ్యాన్స్ కు గాయాలు!

13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా వరల్డ్ కప్ ను ముద్దాడింది. 2011లో వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న తర్వాత ఏ ప్రపంచ కప్ ను కూడా భారత్ గెలవలేకపోయింది. గతేడాది జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయి.. టైటిల్ గెలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. కానీ ఆ ఓటమి నుంచి తేరుకుని.. టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడింది. దాంతో టీమిండియా ప్లేయర్లలో, ఫ్యాన్స్ లో ఎక్కడాలేని సంతోషం నెలకొంది. ఇక వరల్డ్ కప్ తో భారత్ లోకి అడుగుపెట్టిన టీమిండియా ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది. 13 ఏళ్ల కలను నెరవేర్చిన ప్లేయర్లకు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో లక్షల్లో అభిమానులు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో పలువురు ఫ్యాన్స్ కు గాయాలు అయ్యాయి. వారు ఆస్పత్రిలో చేరారు.

టీమిండియా విజయోత్సవ ర్యాలీ నిన్న(బుధవారం) ముంబైలో కన్నుల పండుగగా జరిగింది. ఓపెన్ టాప్ బస్సులో వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా ప్లేయర్లు విజయదరహాసంతో అభివాదం చేస్తుండగా.. అభిమానులు కేరింతలు కొట్టారు. ముంబై వీధులు మెుత్తం జన సంద్రంగా మారాయి. ఈ ర్యాలీకి దాదాపు 3 లక్షల మంది వచ్చినట్లు తెలుస్తోంది. 5 వేల మంది పోలీసులతో బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. అయితే ఊహించిన దాని కంటే ఎక్కువగా అభిమానులు రావడంతో.. ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

కాగా.. టీమిండియా విజయోత్సవ ర్యాలీ సందర్భంగా మెరైన్ డ్రైవ్ కు వచ్చిన అభిమానులు కొందరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో.. స్వల్ప తొక్కిసలాట జరిగింది. దాంతో కొంత మంది ఫ్యాన్స్ గాయపడ్డారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో.. వారిని దగ్గరిలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే వారు గురువారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరేడ్ తర్వాత మెరైన్ డ్రైవ్ లో ఎక్కడ చూసినా.. చెప్పుల కుప్పలు కనిపించాయి. ఇక ర్యాలీ అనంతరం బీసీసీఐ వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.