iDreamPost
android-app
ios-app

టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్!

  • Published Sep 02, 2024 | 6:16 PM Updated Updated Sep 02, 2024 | 6:16 PM

Keerthi Azad, Poonam Jha Azad, Team India: టీమిండియా వరల్డ్ కప్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఓ మాజీ క్రికెటర్ ఇంట విషాదం నెలకొంది. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Keerthi Azad, Poonam Jha Azad, Team India: టీమిండియా వరల్డ్ కప్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఓ మాజీ క్రికెటర్ ఇంట విషాదం నెలకొంది. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

  • Published Sep 02, 2024 | 6:16 PMUpdated Sep 02, 2024 | 6:16 PM
టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్!

క్రికెట్​లో అప్పటిదాకా భారత్ అంటే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. మన టీమ్​లోని ఒకరిద్దరు ప్లేయర్ల గురించి తప్పితే మొత్తం జట్టు గురించి ఎవరూ మాట్లాడుకునేవారు కాదు. అడపాదడపా విజయాలు సాధించినా మన టీమ్ క్రికెట్​ను డామినేట్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఒక్క టోర్నమెంట్​తో అంతా మారిపోయింది. 1983లో జరిగిన వన్డే ప్రపంచ కప్​ను సొంతం చేసుకుంది కపిల్ డెవిల్స్. అండర్​డాగ్స్​గా బరిలోకి దిగి విశ్వవిజేతగా నిలిచింది. అప్పటి నుంచి జెంటిల్మన్ గేమ్​లో భారత శకం మొదలైంది. ఇప్పుడు మన టీమ్ ఫుల్ డామినేట్ చేస్తోంది. కపిల్ దేవ్ సారథ్యంలో తొలి ప్రపంచ కప్ నెగ్గడం భారత క్రికెట్​కు సిసలైన మలుపు అని చెప్పాలి. అలాంటి విజయంలో, ట్రోఫీని భారత్ గెలుచుకోవడంలో కొందరు హీరోల పాత్ర ఎంతో ఉంది. టీమిండియాను ఛాంపియన్​గా నిలిపిన ఆ జట్టులో కీర్తి ఆజాద్ ఒకడు. దేశానికి ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన ఆయన ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది.

టీమిండియా తొలి వరల్డ్ కప్ హీరో కీర్తి ఆజాద్​ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి పూనమ్ ఝా ఆజాద్ ఇవాళ కన్నుమూసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆజాద్ తెలియజేశాడు. పూనమ్ ఇక లేదంటూ ట్విట్టర్​లో పెట్టిన పోస్ట్​లో ఆయన ఎమోషనల్ అయ్యాడు. ఆమె తమను విడిచి స్వర్గానికి వెళ్లిపోయిందని తెలిపాడు. ఈ దు:ఖ సమయంలో తనకు అండగా ఉన్న వారందరికీ అతడు ధన్యవాదాలు చెప్పాడు. ‘నా భార్య పూనమ్ ఇక లేదు. ఇవాళ మధ్యాహ్నం ఆమె కన్నుమూసింది. ఆమె కోలుకోవాలని ప్రార్థించిన వారికి నా కృతజ్ఞతలు’ అని ఆజాద్ పోస్ట్​లో రాసుకొచ్చాడు. కీర్తి ఆజాద్ భార్య వియోగం గురించి తెలిసిన మాజీ ఆటగాళ్లు, పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పటి తరం ఆటగాళ్లు కీర్తికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కీర్తి ఆజాద్ భార్య పూనమ్ లేరనే వార్త తెలియగానే వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంతాపం తెలియజేశారు. పూనమ్ తనకు చాన్నాళ్లుగా తెలుసునని, ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. పూనమ్​ను బతికించేందుకు కీర్తి ఆజాద్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నించారని చెప్పారు దీదీ. ఇక, క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక కీర్తి ఆజాద్ పాలిటిక్స్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన తృణమూల్ కాంగ్రెస్ట పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇక, 1983 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్​లో మెంబర్ అయిన కీర్తి ఆజాద్.. మొత్తంగా భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 135 పరుగులు చేశాడు. 25 వన్డేల్లో 269 పరుగులు చేశాడు. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో ఆయనకు అద్భుతమైన రికార్డు ఉంది. 142 మ్యాచుల్లో 6634 పరుగులు చేయడమే గాక 234 వికెట్లు పడగొట్టాడు.