The GOAT Movie Review: విజయ్ ది గోట్ రివ్యూ.. సినిమా తెలుగు వారికి నచ్చుద్దా?

The GOAT Movie Review & Rating: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ది గోట్ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రివ్యూ మీకోసం..

The GOAT Movie Review & Rating: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ది గోట్ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రివ్యూ మీకోసం..

ది గోట్

05-09-2024, యాక్షన్ థ్రిల్లర్, 3H 3M U/A
U/A
  • నటినటులు:విజయ్, మీనాక్షీ చౌదరి, స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, ప్రేమ్ జి అమరన్, అజ్మల్ అమీర్, వైభవ్, యోగిబాబు తదితరులు
  • దర్శకత్వం:వెంకట్ ప్రభు
  • నిర్మాత:కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్
  • సంగీతం:యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ:సిద్ధార్థ్ నూని

Rating

2

ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). మానాడు లాంటి వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్నేహ, మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుద్దా లేదా అంటే..

కథేంటంటే..

గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందంలో కీలక వ్యక్తి. స్నేహితులతో కలిసి మిషన్స్ చేస్తుంటాడు. తను చేసే ఉద్యోగం గురించి భార్య అను (స్నేహ) కు కడా చెప్పడు. ఈ క్రమంలో ఓ మిషన్ కోసం భార్య పిల్లలతో థాయ్ లాండ్ వెళ్లినప్పుడు కొడుకు జీవన్ (విజయ్)ను కోల్పోతాడు. భర్త చేసే ఉద్యోగం వల్లే తన కొడుకు చనిపోయాడని భావించి.. అను అతడికి దూరం అవుతుంది. ఇక గాంధీ కూడా కుమారుడు మరణించాడని తనకు తాను శిక్ష విధించుకుని దానిలో భాగంగా.. స్క్వాడ్ వదిలి బయటకు వస్తాడు.

పదిహేనేళ్ల తర్వాత అనూహ్యంగా గాంధీకి జీవన్ కనిపిస్తాడు. కొడుకు కనిపించిన సంతోషంలో ఇండియాకు తీసుకొస్తాడు. అయితే ఆ తర్వాత నుంచి గాంధీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఒక్కొక్కరుగా హత్యకు గురి అవుతారు. ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు.. మీనన్ (మోహన్) ఎవరు.. తండ్రి గాంధీ మీద కొడుకు జీవన్ ఎందుకు పగతో ఉన్నాడు.. తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ..

విజయ్ కెరీర్ లో ఇదే చివరి సినిమా అంటూ ప్రచారం జరగడంతో.. ది గోట్ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో బజ్ అంతగా ఏర్పడలేదు. ఇక సినిమా విషయానికి వస్తే.. కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. ఇలాంటి స్టోరీతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అలాగే హీరో కొడుకుని విలన్ పెంచి హీరో మీదే ప్రయోగించే మూవీలు కూడా చాలా వచ్చాయి. ఈ చిత్రంలో కూడా అదే పాయింట్ను ప్రధానంగా ఎంచుకున్నారు. అయితే హీరో కొడుకు తండ్రి మీదే పగ తీర్చుకోవడానికి వచ్చిన తర్వాత రాసుకున్న సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా నడిపించాయి.

ఫస్టాఫ్ అంతా హీరో ఇంట్రడక్షన్.. రోటిన్ యాక్షన్ సన్నివేశాలతో సాదాసీదగా సాగుతుంది. ఫస్టాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండాఫ్ బెటర్ అనిపిస్తుంది. కానీ, అక్కడ కూడా చాలా ల్యాగ్ ఉంది. ఇంటర్వెల్ ముందు కొడుకు విలన్ అని రివీల్ చేశాక… సెకండాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య ఆట ఎలా ఉంటుందో.. ఆ క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుంది.. అనేది ఊహించడం కష్టం కాదు. అదీ సాగదీశారు వెంకట్ ప్రభు.

స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని పేరు పెట్టారు గానీ… ‘ది గోట్’లో కంటే ‘తుపాకీ’లో టెర్రరిస్టులను కనిపెట్టి, చంపే సన్నివేశాలు చాలా బావుంటాయి. గాంధీ – నెహ్రు – బోస్ కామెడీ ట్రాక్ కూడా నవ్వించలేదు. పాటలున్నా.. ఒక్కటి కూడా వినాలనిపించేలా లేదు. పాటలు, నేపథ్య సంగీతంలో యువన్ శంకర్ రాజా నిరాశ పరిచారు.

నటీనటుల పనితీరు..

ఈ సినిమాలో దళపతి విజయ్ రెండు పాత్రలలో మెరిశాడు. అయినప్పటికీ చిన్న విజయ్ డిజిటలైజ్డ్ లుక్‌ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఎప్పటిలానే ఎమోషన్స్ సీన్స్ లో తన యాక్టింగ్ పూర్ అని మరోసారి నిరూపించాడు. అయితే డ్యాన్స్ కూడా దుమ్ము రేపాడు. ఇక ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి పాత్రలు డీసెంట్‌గా ఉన్నాయి. ప్రేమ్ జీ, యోగిబాబు తమ పాత్రలో పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ అంశాలు:

కెమెరా వర్క్ చాలా బాగుంది. డీ ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేసిన యంగ్ విజయ్ లుక్ ట్రోల్ చేసేంత విధంగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో యువన్ శంకర్ రాజా ఫుల్స్ మార్క్స్ తెచ్చుకున్నాడు.. కానీ పాటల విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఇక స్టంట్స్ డిజైనింగ్ బాగుంది. కానీ కీలకమైన ఎపిసోడ్స్ కొన్ని అప్ టు మార్క్ లేవు. ఎడిటింగ్ మీద మరి కాస్త జాగ్రత్త పెట్టాల్సి ఉండే.

బలాలు:

  • విజయ్
  • ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్

బలహీనతలు:

  • తెలిసిన కథ
  • సాగతీత
  • సాంగ్స్

రేటింగ్: 2.0

చివరి మాట: గోట్ మరీ అంత గ్రేటెస్ట్ ఏం కాదు.

Show comments