iDreamPost
android-app
ios-app

The Goat: ది గోట్ పై పెరుగుతున్న నెగిటివిటీ.. స్పందించిన డైరెక్టర్!

  • Published Sep 09, 2024 | 9:10 PM Updated Updated Sep 09, 2024 | 9:10 PM

The Goat: విజయ్ రీసెంట్ గా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు.

The Goat: విజయ్ రీసెంట్ గా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు.

The Goat: ది గోట్ పై పెరుగుతున్న నెగిటివిటీ.. స్పందించిన డైరెక్టర్!

తమిళ స్టార్ హీరో విజయ్ రీసెంట్ గా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో సెప్టెంబర్ 5న విడుదల అయిన ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కోలీవుడ్ లో ప్రస్తుతానికి డీసెంట్ గా ఆడుతున్నా కానీ మిగతా భాషల్లో మాత్రం ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ముఖ్యంగా తెలుగు భాషలో ఈ సినిమా దారుణమైన టాక్ ని సొంతం చేసుకుంది. విజయ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలో కూడా ఈ సినిమా వసూళ్లు రాబట్టలేకపోతుంది.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా ఇప్పటిదాకా  200 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తుంది. తమిళనాడు, ఓవర్ సీస్ లో వసూళ్లు డీసెంట్ గా వస్తున్నాయి. అయినా కానీ ఈ సినిమాని ఇంకా నెగిటివ్‌ టాక్ వెంటాడుతోంది. సినిమా బాగాలేదంటూ చాలా నెగిటివ్‌ రివ్యూలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై వస్తున్న నెగటివిటీపై దర్శకుడు వెంకట్ ప్రభు రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాను తీసింది కేవలం ప్రేక్షకుల కోసమని, విమర్శకుల కోసం కాదని అన్నారు వెంకట్ ప్రభు. ఈ సినిమాని తెరకెక్కించేందుకు తాము పడ్డ కష్టాన్ని ఎవరూ గుర్తించరని, కానీ కొంత మంది మాత్రం కావాలనే పని గట్టుకొని మరీ ఈ మూవీపై నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారని  చెప్పుకొచ్చారు.

ఇక గోట్‌ మూవీలో ఉన్న రిఫరెన్స్‌లు ఏ సినిమాలోనూ ఉండవని అన్నారు. అందరి హీరోల అభిమానులు ఈ సినిమాని సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఆలోచనతోనే రిఫరెన్స్‌లను తీసుకున్నామని అన్నారు. కామన్ ఆడియెన్స్​, అభిమానులు కోరుకునే అన్ని అంశాలను ఈ సినిమాలో ఉండేలా తీర్చిదిద్దాం. అయితే గోట్ సినిమాలో CSK రిఫరెన్స్ తీసుకోవడం వలన తెలుగు, హిందీలో సరిగ్గా ఆడదని ఊహించాను. నేను CSK అభిమానిని కాబట్టి ముంబై ఇండియన్స్, ఆర్సీబీ అభిమానులు నన్ను ఎప్పుడు ట్రోల్ చేస్తుంటారు. దానికి నేను చెయ్యగలిగింది ఏమి లేదని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వెంకట్ ప్రభు చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.