iDreamPost
android-app
ios-app

The Goat Day 2 Collections: ది గోట్ డే 2 కలెక్షన్లు ఎంతంటే?

  • Published Sep 07, 2024 | 1:58 PM Updated Updated Sep 07, 2024 | 1:58 PM

The Goat Day 2 Collections: విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' (The GOAT). ఈ సినిమా రెండవ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. భారీగా తగ్గాయనే తెలుస్తుంది.

The Goat Day 2 Collections: విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' (The GOAT). ఈ సినిమా రెండవ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. భారీగా తగ్గాయనే తెలుస్తుంది.

  • Published Sep 07, 2024 | 1:58 PMUpdated Sep 07, 2024 | 1:58 PM
The Goat Day 2 Collections: ది గోట్ డే 2 కలెక్షన్లు ఎంతంటే?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The GOAT). మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ సినిమా విజయ్ కెరీర్లో 68వ సినిమాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యింది. భారీ అంచనాలతో సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని మూట గట్టుకుంది. అయినా కానీ ఈ సినిమాకి మొదటి రోజు భారీ వసూళ్లు నమోదయ్యాయి. విజయ్ సినిమా కావడంతో అభిమానులు భారీగా థియేటర్లకు వచ్చారు. అందువల్ల బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టింది.

ది గోట్ రెండవ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. భారీగా తగ్గాయనే తెలుస్తుంది. తమిళ నాడులో ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. ఇంకా విచిత్రం ఏంటంటే.. విజయ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలో కూడా ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. కానీ తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి డీసెంట్ వసూళ్లు నమోదయినట్లు తెలుస్తుంది. రెండవ రోజు తమిళ నాడులో ఈ సినిమాకి 22 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తుంది. వచ్చిన టాక్ తో పోలిస్తే.. ఇవి డీసెంట్ వసూళ్లనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలు, కేరళలో అయితే ఈ సినిమాకి చాలా దారుణంగా 2 కోట్లు మాత్రమే వచ్చాయి.

ఇక కర్ణాటక, మిగతా హిందీ ఏరియాల్లో కలిపి రెండు రోజుల్లో కేవలం 6 కోట్లు మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి రెండవ రోజు ఇండియాలో ఈ సినిమాకి 30 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమాకి మంచి వసూళ్లే నమోదయ్యాయని తెలుస్తుంది. ఓవర్ సీస్లో ఈ సినిమాకి 25 కోట్ల వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది. ఇక రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 157 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకి తమిళనాడు, ఓవర్ సీస్ లో మంచి వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలు, కేరళలో మాత్రం ఘోరంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రెండు రోజుల వసూళ్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet