iDreamPost
android-app
ios-app

Parakramam Review: పరాక్రమం సినిమా రివ్యూ

Parakramam Movie Review: బండి సరోజ్ కుమార్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. మొదటి సినిమా నిర్బంధంతోనే తనలో ఉన్న దర్శకుడిని పరిచయం చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత సూర్యాస్తమయం, మాంగల్యం సినిమాలు తీసి మరో మెట్టు ఎక్కేశాడు. ఈ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే కంటెంట్ మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా పరాక్రమం సినిమా కూడా అంతే అంచనాల నడుమ విడుదలైంది. మరి బండి సరోజ్ కుమార్ తీసిన ఈ చిత్రం ఆకట్టుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం.

Parakramam Movie Review: బండి సరోజ్ కుమార్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. మొదటి సినిమా నిర్బంధంతోనే తనలో ఉన్న దర్శకుడిని పరిచయం చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత సూర్యాస్తమయం, మాంగల్యం సినిమాలు తీసి మరో మెట్టు ఎక్కేశాడు. ఈ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే కంటెంట్ మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా పరాక్రమం సినిమా కూడా అంతే అంచనాల నడుమ విడుదలైంది. మరి బండి సరోజ్ కుమార్ తీసిన ఈ చిత్రం ఆకట్టుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం.

Parakramam Review: పరాక్రమం సినిమా రివ్యూ

బండి సరోజ్ కుమార్.. హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్. తనకు నచ్చినట్టు సినిమాలు చేయడానికి.. పెద్ద అవకాశాలు కూడా వదులుకున్న జెన్యూన్ ఫిల్మ్ మేకర్. ఇలాంటి వ్యక్తి నుంచి మూవీ వస్తుంది అంటే  ఫిల్మ్ లవర్స్  ఎప్పుడూ ఈగర్ గానే వెయిట్ చేస్తూ ఉంటారు. సరోజ్ కుమార్ నుంచి తాజాగా పరాక్రమం అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా  తెలుసుకుందాం. 

కథ: 

లంపకలోవ అనే చిన్న గ్రామంలో సత్తిబాబు (బండి సరోజ్ కుమార్) నాటకాలు వేస్తూ జీవిస్తూ ఉంటాడు. కళాకారుడైన సత్తిబాబుకి యముడిగా నాటకం వేయడం అంటే ఇష్టం. కాకపోతే.. అతనికి అంతటి పరాక్రమం ఉండదు. ఓ రోజు ఆ ఊరి మున్సిబ్ సత్తిబాబుని యముడి నాటకం వేయద్దు అని ఆదేశిస్తాడు.  కాకపోతే.. సత్తిబాబు కొడుకైన లోవరాజు (బండి సరోజ్ కుమార్) మాత్రం చిన్న వయసులోనే మున్సిబ్ ని ఎదిరించి యముడి నాటకం వేస్తాడు. దీంతో.. సత్తిబాబుకి తన కొడుకులోని పరాక్రమం అర్థం అవుతుంది. తర్వాత సత్తిబాబు తాను ఎక్కువ రోజులు  బతకనని,  నీవు పెద్దయ్యాక..  నేను స్వయంగా రాసిన పరాక్రమం నాటకాన్ని ప్రదర్శించాలని మాట తీసుకుంటాడు. అసలు సత్తిబాబు రాసిన పరాక్రమం నాటకంలో ఏముంది? ఆ ఊరి మున్సిబ్ యముడి నాటకానికి ఎందుకు భయపడుతున్నాడు? లోవరాజు ఆ నాటకం ప్రదర్శించడానికి ఎలాంటి ఇబ్బందులను అధిగమించాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైనా ప్రేమ, పగ ఏంటి? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానమే పరాక్రమం మూవీ. 

విశ్లేషణ:

7 చేపల కథని అందరూ అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అనే మొదలు పెడతారు. కానీ.., బండి సరోజ్ కుమార్ మాత్రం ఓసారి ఎండేసిన 7 చేపల్లో ఒక చేప ఎండలేదు.. ఎందుకంటే? అని మొదలు పెడతాడు. అది అతని స్టైల్. ఏదైనా కొత్తగా చెప్పాలి, కొత్తగా చేయాలి అనే తపన అది. పరాక్రమం మూవీ కూడా ఈ కోవకే చెందిన సినిమా. ఆడపిల్లకి రక్షణపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న సమయంలో బండి సరోజ్ కుమార్.. ఇలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా అభినందించదగ్గ విషయం. కాకపోతే.. ఆ కథని ప్రజెంట్ చేసిన విధానమే కాస్త కన్ఫ్యూజన్ గా తయారైంది. నావెల్ ఆర్డర్ స్క్రీన్ ప్లేతో కథ చెప్పాలి అంటే.. ప్రజెంట్, ఫ్లాష్ బ్యాక్ రెండింటిలోనూ బలమైన ఎమోషన్ ఉండాలి. ఆ రెండిటికీ కూడా కథతో ఇంటర్ లింక్ ఉండాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా బండి సరోజ్ కుమార్  చేసిన ఆలోచన బెడిసికొట్టి.. పరాక్రమం సినిమాకి స్క్రీన్ ప్లే ఇబ్బందిగా మారిపోయింది. 

పరాక్రమం సినిమా మొదలైన తీరు నిజంగా  ఆశ్చర్యానికి గురి చేసింది. కథలోని హైలెట్ పాయింట్స్ అన్నీ ఇంటర్ కట్ షాట్స్ తో ప్లే అవుతూ,  టైటిల్స్  పడుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అలానే.. మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ తోనే కథ ఓపెన్ చేసిన తీరు బాగుంది. కాకపోతే..  సత్తిబాబు పాత్ర ఉన్నంత వరకే ఆ ఎగ్జైట్మెంట్ ఉంది. ఇక లోవరాజుని పరిచయం దగ్గర నుంచి కథ  కమర్షియల్ టర్న్  తీసుకుంది. దీనికి.. నావెల్ ఆర్డర్ స్క్రీన్ ప్లే బలవంతంగా యాడ్ చేయడంతో ప్రేక్షకుడు లోవరాజుతో జర్నీ చేయడం కష్టంగా మారింది. అయితే.., మధ్య మధ్యలో వచ్చే అద్భుతమైన డైలాగ్స్ మాత్రం ఆడిటోరియాన్ని రీ సౌండ్ పెట్టించే రేంజ్ లో ఉన్నాయి. అంతా చేసి.. లోవరాజు పాత్ర ఫస్ట్ ఆఫ్ అయ్యే సమయానికి ఒక లవ్ ఫెయిల్యూర్ గా మాత్రమే మిగిలిపోవడం కాస్త మింగుడుపడని విషయంగా మారుతుంది. 

పరాక్రమం సెకండ్ ఆఫ్ కూడా ఎంతో ఆశాజనకంగా మొదలవుతుంది. ముఖ్యంగా సత్తిబాబు ఎపిసోడ్ అంతా  అద్భుతంగా వచ్చింది. ఇక తండ్రి అనుభవించిన కష్టం తెలిశాక..ఇచ్చిన మాటని నిలబెట్టుకునే కొడుకుగా లోవరాజు నటన కూడా అద్భుతంగా ఉంది. అయితే.., ఆ పగ తీర్చుకోవడానికి సాగిన కథ తీరు మాత్రం సగటు ఆడియన్ కి రుచించే రీతిలో లేదు. ఓ  కళాకారుడి కొడుకు..,  ఆ కళతోనే తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని, పగ తీర్చుకోవడం అనే మంచి పాయింట్ ని, అంతే గొప్పగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఈ మొత్తం సీక్వెన్స్ కి మాస్ టచ్ ఇచ్చి, దాన్ని సగం మాత్రమే ఫుల్ ఫిల్ చేయడంతో పరాక్రమం ఇంకాస్త గాడి తప్పింది. ఇక ప్రీ క్లైమాక్స్ నుండి లోవరాజు పాత్ర.. వరుసగా చెప్పుకుంటూ పోయే  డైలాగ్స్  బాగున్నాయి తప్ప, ఎమోషన్ పండక  కథనం పట్టు తప్పిపోయింది. దీంతో.. పరాక్రమం మూవీ గ్రాఫ్ పడిపోయింది. 

నటీనటులు, టెక్నికల్ విభాగం : 

ఇక నటన పరంగా ఇది బండి సరోజ్ కుమార్ వన్ మ్యాన్ షో మూవీ. చాలా సన్నివేశాల్లో సరోజ్ కుమార్ యాక్టింగ్ కి మెస్మరైజ్ అయిపోతాము. మిగతా నటీనటులు అంతా ఆయా పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా బండి సరోజ్ కి మంచి మార్కులే పడతాయి. ఒక్క మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఉండటం నిజంగా గొప్ప విషయం. సినిమా మొత్తం మీద డైలాగ్స్ మాత్రం అద్భుతంగా అనిపిస్తాయి. ఓ పక్కా కమర్షియల్ సినిమాకి అతికినట్టు సరిపోయే డైలాగ్స్ ఇవి. ఇన్ని విషయాల్లో బెటర్ అనిపించుకున్న సరోజ్ కుమార్ స్క్రీన్ ప్లేలో గాడి తప్పాడు. ఇక  వెంకట్.ఆర్. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. డార్క్ లైట్స్ తో తీసిన  చాలా షాట్స్ సూపర్ న్యాచురల్ గా అనిపించాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అక్కడక్కడా డల్ అనిపించినా.. ఓవరాల్ గా ఓకే అనిపిస్తాయి. ఇక దర్శకుడిగా మాత్రం బండి సరోజ్ కుమార్ కి మంచి ఫ్యూచర్ ఉంది. 

ప్లస్‌లు:

  • బండి సరోజ్ కుమార్ నటన  
  • డైలాగ్స్ 
  • సత్తిబాబు క్యారెక్టర్ 

మైనస్‌లు: 

  • ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే 
  • ప్రీ క్లైమాక్స్ తేలిపోవడం 
  • తారాబలం లేకపోవడం