Geethanjali Malli Vachindhi Movie Review: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ రివ్యూ! అంజలి మరోసారి భయపెట్టిందా?

అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీక్వెల్ ఎలా ఉంది? అంజలి మరోసారి భయపెట్టిందా? ఈ రివ్యూలో చూద్దాం.

అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీక్వెల్ ఎలా ఉంది? అంజలి మరోసారి భయపెట్టిందా? ఈ రివ్యూలో చూద్దాం.

గీతాంజలి మళ్లీ వచ్చింది

20240411, హార్రర్ కామెడీ, 2h: 24mi
  • నటినటులు:అంజలి, శ్రీనివాస్ రెడ్డి, రాహుల్ మాధవ్, సత్య, సత్యం రాజేష్, షకలక శంకర్ తదితరులు
  • దర్శకత్వం:శివ తుర్లాపాటి
  • నిర్మాత:కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ
  • సంగీతం:ప్రవీణ్ లక్కరాజు
  • సినిమాటోగ్రఫీ:సుజాత సిద్ధార్థ

Rating

2.5

సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే.. ఆ మూవీకి సీక్వెల్స్ ప్లాన్స్ చేస్తుంటారు మేకర్స్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్ ఇదే. ఇదే ట్రెండ్ తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంజలి నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ. 2014లొ వచ్చిన అంజలి మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను భయపెట్టిందా? మరోసారి అంజలి తన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకుందా? కోన వెంకట్ తన పేరును నిలబెట్టుకున్నాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం పదండి.

కథ:

గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఊటీలో జరుగుతుంది. ఆరుద్ర(షకలక శంకర్), శ్రీను(శ్రీనివాస్ రెడ్డి), ఆత్రేయ(సత్యం రాజేష్) మూవీ ఛాన్స్ ల కోసం హైద్రాబాద్ లో తిరుగుతూ ఉంటారు. మరోవైపు అయాన్(సత్య) హీరో కావాలని కలలు కంటూ, తన ప్రయత్నాలు తాను చేస్తుంటాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ అయిన ఆరుద్ర, శ్రీను, ఆత్రేయలకు భాగానే ఖర్చు పెడతాడు. కానీ హీరో అవ్వాలన్న కల మాత్రం అలాగే ఉంటుంది. ఇక ఇదే టైమ్ లో శ్రీనుకి ఊటిలో ఉన్న బిజినెస్ మెన్ విష్ణు(రాహుల్ మాధవ్) నుంచి కాల్ వస్తుంది. తమ ఊర్లో ఉన్న సంగీత్ మహల్ లో సినిమా తీయాలని, కథను కూడా అందిస్తానని, కానీ అదే ఊర్లో టీ షాప్ నడుపుతున్న అంజలి(అంజలి)ని హీరోయిన్ గా ఒప్పిస్తేనే మూవీ తీస్తానని కండీషన్ పెడతాడు. అసలు విష్ణు అంజలితోనే సినిమా తీయాలని ఎందుకు అనుకుంటున్నాడు? సంగీత్ మహల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అక్కడ జరుగుతున్న హత్యల వెనుక ఎవరున్నారు? విష్ణు ఎవరు? అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

హార్రర్ కామెడీ మూవీలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. కాస్త వెరైటీగా తీస్తే.. ఈ జానర్ చిత్రాలకు కాసుల వర్షం కురుస్తుంది. ఇదే ట్రెండ్ ను టాలీవుడ్ అనాదిగా ఫాలో అవుతూ వస్తోంది. ఇక కామెడీ హార్రర్ చిత్రాల్లో ‘గీతాంజలి’ ప్రత్యేక ట్రెండ్ నే క్రియేట్ చేసింది. ఇక ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలమైందనే చెప్పాలి. కోన వెంకట్, భాను, శివ తుర్లపాటి ముగ్గురు కలిసి ఈ సినిమాను ఓ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ మూవీ ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకులకు ఏదో తెలియని వెలితి. కానీ సత్య కామెడీ ఆ వెలితిని పూడ్చాడు. అయితే సెకండాఫ్ నుంచి అసలైన కథ మెుదలవుతుంది. సంగీత్ మహల్ లో సినిమా షూటింగ్ ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో.. అప్పటి నుంచి ఓ రేంజ్ కు వెళుతుంది. ప్రతీసీన్ నవ్విస్తూనే.. భయపెట్టిస్తుంది. అయితే కొన్ని కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉంటాయి. కానీ అవి కూడా అభిమానులను నవ్విస్తాయి. మరీ ముఖ్యంగా షూటింగ్ లో దెయ్యాలతో చేసే వినోదం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ. కానీ క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులు అనుకున్నరేంజ్ ను అందుకోలేకపోయింది. కామెడీ హార్రర్ మూవీలను చూసే వారిని గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కడుపుబ్బా నవ్విస్తుంది.

నటీనటుల పనితీరు

పేరుకే గీతాంజలి లీడ్ హీరోయిన్ అయినా.. ఇందులో మాత్రం ఆమె పాత్ర తక్కువనే చెప్పాలి. కానీ కనిపించినంత సమయంలో మాత్రం తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. సత్య ఈ మూవీకి హీరో అనే చెప్పాలి. తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఇక చాలా సంవత్సరాల తర్వాత సునీల్ తన కామెడీతో మెస్మరైజ్ చేశాడు. రాహుల్ మాధవ్ విలన్ గా మెప్పించాడు. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్ ఎప్పటిలానే తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ విభాగం విషయానికి వస్తే.. గ్రాఫిక్స్ హైలెట్ అనే చెప్పాలి. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ అక్కడక్కడ మూవీని ఓ రేంజ్ కు తీసుకెళ్లారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు

  • సత్య యాక్టింగ్
  • కామెడీ సీన్లు
  • స్క్రీన్ ప్లే

బలహీనతలు

  • రొటీన్ స్టోరీ
  • రొటీన్ క్లైమాక్స్

చివరి మాట: గీతాంజలి నవ్విస్తూ.. భయపెట్టడంలో కాస్త తగ్గింది.

(గమనిక): ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

Show comments