Tirupathi Rao
YSRCP 9th List: అధికార వైసీపీ పార్టీ తాజాగా 9వ జాబితా విడుదల చేసింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధిచి చేస్తున్న మార్పుల్లో భాగంగా తాజాగా మరో జాబితాను విడుదల చేసింది.
YSRCP 9th List: అధికార వైసీపీ పార్టీ తాజాగా 9వ జాబితా విడుదల చేసింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధిచి చేస్తున్న మార్పుల్లో భాగంగా తాజాగా మరో జాబితాను విడుదల చేసింది.
Tirupathi Rao
అసెంబ్లీ- లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా వైసీపీ తొమ్మిదో జాబితాను విడుదల చేసింది. శుక్రవారం విడుదల చేసిన 9వ జాబితాలో నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించారు. మంగళగిరి సమన్వయకర్తగా మురుగుడు లావణ్య పేరును ప్రకటించారు. గతంలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి గంజి చిరంజీవిని ప్రకటించగా తాజా జాబితాలో మార్పు చేస్తూ.. మురుగుడు లావణ్య పేరును ప్రకటించారు. అలాగే కర్నూలు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పేరును ప్రకటించారు.
ఇటీవల మంగళగిరిలో జరిగిన సభలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఒకటి రెండు మార్పులు తప్పితే దాదాపు అభ్యర్థులు ఖరారు అయిపోయినట్లే అని చెప్పారు. చిన్న చిన్న మార్పులు తప్పితే ఇప్పటివరకు ఎవరి పేర్లైతో ప్రకటించారో వారికే సీట్లు దక్కుతాయని చెప్పారు. 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో, 25కు 25 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాలి.. సాధించబోతున్నాం అంటూ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. గడప గడపకు తిరిగి ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయం ఎంతో కీలకమైంది అంటూ నాయకులకు వారి కర్తవ్యాన్ని గుర్తు చేశారు. మరోసారి చరిత్ర సృష్టించడానిక సిద్ధపడాలి అంటూ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎం @ysjagan గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నెల్లూరు ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా వి.విజయసాయిరెడ్డిని, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎండీ ఇంతియాజ్ నియమిస్తూ లేఖను విడుదల చేసింది… pic.twitter.com/YvUTWfTNQ5
— YSR Congress Party (@YSRCParty) March 1, 2024