Dharani
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ మొదలయ్యింది. తెలంగాణలో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్/మే నాటికి ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలక్షన్‌లకు సమయం దగ్గర పడుతుండటంతో.. అన్ని పార్టీలు స్పీడు పెంచాయి. ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికార వైఎస్సార్‌సీపీ.. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి.. మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తుండగా.. టీడీపీ.. వైసీపీని ఓడించి.. అధికారం హస్తగతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం పొత్తులకు కూడా రెడీ అవుతోంది. ఇక జనసేన సైతం రానున్న ఎన్నకల కోసం దూకుడుగా ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులుంటాయని ఇప్పటికే జనసేన క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఒక్కటి ఒకవైపు.. మిగతా పార్టీలన్ని ఒకవైపుగా పోటీ సాగనుందని ఇప్పటికే స్పష్టమైంది. రానున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది.. ఎంత శాతం ఓట్లు రాబడుతుంది.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాల మీద ప్రముఖ సర్వే సంస్థ పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే నిర్వహించింది. బుధవారం సాయంత్ర ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది.
ఇక ఈ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతోంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ 49 శాతం మేర ఓట్లు రాబట్టి.. మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ తేల్చింది. అలానే వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని వెల్లడించింది. అలానే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తోందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ అంచనా వేస్తోంది. ఈ రెండు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తే.. 41 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలుస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ అభిప్రాయపడింది. ఇక బీజేపీ, కాంగ్రెస్, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కలిసి మరో 10 శాతం ఓట్లు సాధిస్తారని అంచాన వేసింది.
అంతేకాక జగన్‌ని ఇష్టపడే వారి సంఖ్య 56 శాతంగా నమదైందని.. అలానే చంద్రబాబుని మరోసారి సీఎంగా చూడాలనుకునే వారి సంఖ్య కేవలం 37 శాతంగా మాత్రమే ఉందని వెల్లడించింది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని కేవలం 7 శాతం మంది మాత్రమే అభిప్రాయపడుతున్నట్లు పోల్ స్ట్రాటజీ సర్వే రిపోర్ట్ చేసింది. జగన్ సర్కార్‌పై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. ఈ ప్రీపోల్ సర్వే.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Pre-poll Survey results for Andhra Pradesh State:#AndhraPradesh #survey #Election2024 #politics pic.twitter.com/ywnTUoiKBD
— Poll Strategy Group (@PollStrategy) July 12, 2023