iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి దేవినేని ఉమాకు వైసీసీ ఎమ్మెల్యే నోటీసులు.. రూ.10 కోట్లు కట్టాలంటూ

  • Published Jan 08, 2024 | 11:14 AM Updated Updated Jan 08, 2024 | 11:14 AM

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు.. వైసీపీ ఎమ్మెల్యే ఒకరు లీగల్ నోటీసులు పంపారు. అంతేకాక తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆవివరాలు..

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు.. వైసీపీ ఎమ్మెల్యే ఒకరు లీగల్ నోటీసులు పంపారు. అంతేకాక తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆవివరాలు..

  • Published Jan 08, 2024 | 11:14 AMUpdated Jan 08, 2024 | 11:14 AM
మాజీ మంత్రి దేవినేని ఉమాకు వైసీసీ ఎమ్మెల్యే నోటీసులు.. రూ.10 కోట్లు కట్టాలంటూ

తెలుగు దేశం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు భారీ షాక్ తగిలింది. ఆయనపై వైసీపీ ఎమ్మెల్యే ఒకరు లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే.. 10 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా దేవినేని ఉమాను డిమాండ్ చేశారు. అసలేం జరిగింది అంటే గత ఏడాది అనగా 2023, నవంబర్ 22న మైలవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. మైలవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మీద హత్య, ఆర్థిక నేరాల ఆరోపణలు చేశారు.

దేవినేని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వసంత కృష్ణప్రసాద్‌.. వీటి వల్ల తన పరువుకు భంగం వాటిల్లందన్నారు. అంతేకాక దేవినేని ఉమా చేసిన 14 తప్పుడు ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని వసంత కృష్ణప్రసాద్‌ స్పష్టం చేశారు. అంతేకాక తన మీద ఇలా తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను దేవినేని ఉమా తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలోనే దేవినేని ఉమాకు లీగల్ నోటీసులు పంపించారు వసంత కృష్ణప్రసాద్‌.

leagule notice for devineni uma

2019 ఎన్నికల తర్వాత నుంచి మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమా,ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ల మధ్య వార్ నడుస్తోంది. దేవినేని ఉమా 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్య వహించారు.. మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్‌.. ఉమాపై వసంత పోటీచేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

సందర్భం దొరికిన ప్రతి సారి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి దేవినేని ఉమా.. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌‌‌ మీద హత్యా ఆరోపణలు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎమ్మెల్యే.. తాజాగా దేవినేని ఉమాకు లీగల్ నోటీసుల పంపారు. మరి దీనిపై దేశినేని ఉమా ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక కొన్ని రోజుల క్రితం దేవినేని ఉమా అర్థరాత్రి వేళ ప్రత్యేక పూజలు చేస్తున్నారంటూ ఆరోపణలు వెలుగు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రాష్ట్రంలో కలకలం సృష్టించింది.