Tirupathi Rao
కాంగ్రెస్ కు ఎన్నికల్లో విజయం సాధించడం కంటే.. సీఎం అభ్యర్థిని ప్రకటించడమే కష్టంగా మారిపోయింది. ఇప్పటికే సీఎం ఎంపిక ఢిల్లీకి చేరింది. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారమే అభ్యర్థిని ప్రకటిస్తామని అధిష్టానం ధీమాతో ఉంది.
కాంగ్రెస్ కు ఎన్నికల్లో విజయం సాధించడం కంటే.. సీఎం అభ్యర్థిని ప్రకటించడమే కష్టంగా మారిపోయింది. ఇప్పటికే సీఎం ఎంపిక ఢిల్లీకి చేరింది. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారమే అభ్యర్థిని ప్రకటిస్తామని అధిష్టానం ధీమాతో ఉంది.
Tirupathi Rao
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు గెలవడం కంటే కూడా.. సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడమే కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ప్రముఖంగా భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నిజానికి సోమవారం సాయంత్రమే సీఎంతో ప్రమాణం చేయించాలని చూశారు. కానీ, ఎవరూ కూడా రాజీకి వచ్చిన పరిస్థితి లేదు. అందుకే ఈ సీఎం సీటు పంచాయితీ ఢిల్లీకి చేరింది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడు కర్ణాటకా ఫార్ములాని తెలంగాణకు కూడా అప్లయ్ చేయాలని చూస్తోందని తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎన్నికలు గెలిచింది కానీ.. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఎవరిని సీఎంని చేయాలి అని అధిష్ఠానం మంతనాలు చేస్తోంది. అభ్యర్థి ఎంపికపై మాత్రం ఏకాభిప్రాయం వచ్చిన పరిస్థితి కనిపించడం లేదు. కానీ, మంగళవారం సాయంత్రానికి అభ్యర్థిని ప్రకటిస్తామని.. బుధవారం రోజు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం కూడా ఉంటుందని చెబుతున్నారు. అంత ధీమాగా చెప్పడానికి కారణం.. తెలంగాణలో కూడా కర్కాటక తరహా ఫార్ములాని అప్లయ్ చేసేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయంట. అంటే సీఎల్పీ లీడర్ అయిన సిద్ధారామయ్యను కర్ణాటక సీఎంని చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా చేశారు.
ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలో కూడా సీఎల్పీ నేతను సీఎంగా.. పీసీసీ అధ్యక్షుడిని డిప్యూటీ సీఎంగా చేయాలని చూస్తున్నారంట. సీఎల్పీ నేత ఎవరు అనే దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క కామెంట్ కూడా చేశారు. అంటే ఇప్పుడు సీఎల్పీ లీడర్ ఎవరవుతారు అనే దానిపైనే ఉత్కఠ కొనసాగుతోంది. కానీ, ఈ ప్రపోజల్ కు రేవంత్ రెడ్డి అంగీకరించలేదనే వార్తలు వస్తున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించానని.. తననే సీఎం చేయాలని రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు భట్టి విక్రమార్క కూడా తననే సీఎం చేయాలని బలంగా కోరినట్లు చెబుతున్నారు. సీనియర్లను సమన్వయ పరచడం, తన పాదయాత్రతో లీడర్లలోనే కాకుండా.. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పై విశ్వాసాన్ని తీసుకువచ్చానంటూ భట్టి చెబుతున్నారంట.
ఈ ఇద్దరిలో ఎవరిని సీఎం చేయాలి? ఎవరిని డిప్యూటీ చేయాలి అనే విషయంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మంతనాలు చేస్తోంది. రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, థాక్రే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తమ్, భట్టి విక్రమార్కలతో డీకే, థాక్రే విడివిడిగా చర్చలు కూడా జరిపాయి. డీకే శివకుమార్ తన నివేదికను అధిష్టానానికి సమర్పించారు. ఖర్గే నివాసంలో సీఎం అభ్యర్థి ఎంపిక విషయమై సమావేశం కూడా అయ్యారు. దాదాపు మంగళవారం సాయంత్రానికి సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు సీఎం అవుతారు? ఎవరు డిప్యూటీ అవుతారు? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి.. తెలంగాణకు సీఎం అయ్యేది ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.