P Krishna
Hyderabad: నైరుతీ రుతుపవనాలు చురుకుగా సాగుతున్నాయి.. దీని ప్రభావం తెలుగు రాష్ట్రల్లో భారీగా పడి వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కారో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Hyderabad: నైరుతీ రుతుపవనాలు చురుకుగా సాగుతున్నాయి.. దీని ప్రభావం తెలుగు రాష్ట్రల్లో భారీగా పడి వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కారో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
P Krishna
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్లు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఎర్పడిన అల్ప పీడనం సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతుంది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
గత వారం రోజుల నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కలిసి నగర పరిస్థితిపై సమీక్ష జరిపినట్లు తెలుస్తుంది. అంతేకాదు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీని(HYDRAA) ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.జీహెచ్ఎంసీ తో పాటు ఓఆర్ఆర్ వరకు ‘హైడ్రా’ అధికార పరిధిల విస్తరించి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైడ్రా(HYDRAA) కు చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఇందులో రంగారెడ్డి, హైదరాబాద్ కు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్ సభ్యులుగా ఉండబోతున్నాను. నగరంలోని చెరువులు, కుంటలను పరిరక్షించడం, నాలాలు, సర్కార్ భూములు, స్థిరాస్తుల కబ్జాకు గురికాకుండా ‘హైడ్రా’ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పెద్ద పెద్ద హూర్డింగులు, ఫ్లీక్సీల నియంత్రణ, కరెంట్ సప్లై, డ్రేనేజీ, వరద నిర్వహణ, వాటర్ పైప్ లైన్లు,ట్రాఫిక్ నియంత్రణ వంటి సేవల్లో హైడ్ర భాగస్వామ్యం కానుంది. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, 33 మేజర్ పంచాయతీల వరకు హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతాయి.