iDreamPost
android-app
ios-app

రేవంత్‌ రెడ్డిపై ఇన్ని కేసులున్నాయా.. అఫిడవిట్లో ఆస​‍క్తికర విషయాలు

  • Published Nov 10, 2023 | 11:16 AMUpdated Nov 10, 2023 | 11:16 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కీలక నేతలంతా నామినేషన్‌ దాఖలు చేశారు. వారి ఆస్తులు, అప్పులు, కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ క్రమంలో టీపీసీసీ రేవంత్‌ రెడ్డి మీద ఉన్న పెండిగ్‌ కేసుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కీలక నేతలంతా నామినేషన్‌ దాఖలు చేశారు. వారి ఆస్తులు, అప్పులు, కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ క్రమంలో టీపీసీసీ రేవంత్‌ రెడ్డి మీద ఉన్న పెండిగ్‌ కేసుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

  • Published Nov 10, 2023 | 11:16 AMUpdated Nov 10, 2023 | 11:16 AM
రేవంత్‌ రెడ్డిపై ఇన్ని కేసులున్నాయా.. అఫిడవిట్లో ఆస​‍క్తికర విషయాలు

మరో 20 రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టితో అనగా నవంబర్‌ 10న నామినేషన్లు వేయడానికి చివరి రోజు. నిన్న అనగా గురువారం, నవంబర్‌ 9న ఏకాదశి కావడంతో.. అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి, గజ్వేల్‌లో నామినేషన్లు వేయగా.. కేటీఆర్‌, హరీష్‌రావు, భట్టి విక్రమార్క వంటి నేతలు సైతం గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. నవంబర్‌ 6న నామిషేన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక కీలక నేతల నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. వారి ఆస్తులు, అప్పులు, వారి మీద నమోదైన కేసుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో ఆయనపై నమోదయిన కేసుల వివరాలు కూడా వెల్లడించారు. రేవంత్‌పై ఇంత భారీ సంఖ్యలో కేసులు ఉండటం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు..

నవంబర్‌ 6నే నామినేషన్‌..

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన కొండంగల్‌ నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. అయితే ఈ సారి అదొక్కటే కాక.. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కూడా రేవంత్‌ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఈ రెండు స్థానాలకు సంబంధించిన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి తన ఆస్తులు, అప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలను పేర్కొన్నారు.

అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రేవంత్ రెడ్డికి సంబంధించి మొత్తం 89 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఆయుధాల విషయానికి వస్తే.. రేవంత్‌.. తన దగ్గర రెండు ఆయుధాలు ఉన్నట్లు వెల్లడించాడు. వీటిలో ఒకటి 2 లక్షల రూపాయల విలువ చేసే పిస్టల్‌ కాగా.. మరకటి రూ.50 వేలు చేసే రైఫిల్‌. అలానే తనకు రెండు కార్లు ఉన్నాయని.. వీటిల్లో ఒకటి సెకండ్‌ హ్యాండ్‌దని తెలిపాడు. ఇక వ్యక్తిగత, కుటుంబ ఆస్తుల్లో భాగంగా రేవంత్ రెడ్డి దగ్గర.. రూ.5,34,000 నగదు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత పేర్ల మీద కలిపి ఉన్న స్థిర, చరాస్తుల అన్నిటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30,95,52,652గా వివరించారు.

రేవంత్‌ రెడ్డికి ఎంత అప్పుందంటే..

రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత పేరు మీద మొత్తం కలిపి రూ.1,30,19,901 మేర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వద్ద రెండు వాహనాల్లో ఒకటి హోండా సిటీ కారు, రెండోది మెర్సిడిస్ బెంజ్ కారు. వాటిలో మెర్సిడిస్ బెంజ్ కారు సెకండ్ హ్యాండ్ కారు అని పేర్కొన్నారు. రేవంత్ భార్య దగ్గర 1,235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.83,36,000. దీంతో పాటు గీత వద్ద రూ.7,17,800 విలువైన 9,700 గ్రాముల వెండి, వెండి వస్తువులు కూడా ఉన్నాయని అఫిడవిట్లో సమర్పించారు9.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి