iDreamPost
android-app
ios-app

అలిగిన కోడళ్లకు గెలవగానే శుభవార్త.. వారందరికి నెలకు రూ.3వేలు: కేటీఆర్‌

  • Published Nov 17, 2023 | 9:28 AM Updated Updated Nov 17, 2023 | 9:28 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. భారీ శుభవార్త చెప్పారు. అధికారంలోకి రాగానే వారందరికి నెలకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. భారీ శుభవార్త చెప్పారు. అధికారంలోకి రాగానే వారందరికి నెలకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

  • Published Nov 17, 2023 | 9:28 AMUpdated Nov 17, 2023 | 9:28 AM
అలిగిన కోడళ్లకు గెలవగానే శుభవార్త.. వారందరికి నెలకు రూ.3వేలు: కేటీఆర్‌

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. నేటికి సరిగ్గా పదమూడో నాడు అనగా నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుంది. మూడు రోజుల వ్యవధిలోనే అనగా డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేలా వారిపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. అలానే ప్రచార కార్యక్రమాల్లో వాడీవేడి విమర్శలు చేసుకుంటున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ తరఫున ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. అలానే వ్యక్తిగతం ఇంటర్వ్యూలు ఇస్తూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మేలు.. రాబోయే కాలంలో తీసుకవచ్చే సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రసుత్తం రాష్ట్రంలో ఉన్న కోడళ్లు అసంతృప్తితో ఉన్నారని.. అధికారంలోకి రాగానే వారికి శుభవార్త చెప్తామని తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేటీఆర్‌ వికారాబాద్‌, మర్పల్లి, మోయినాబాద్‌లలో రోడ్‌ షోలు నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి కాలె యాదయ్య(చేవెళ్ల)ను, ఆనంద్‌ (వికారా బాద్‌)ను మరోసారి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అందరికీ ఏదో ఒకటి ఇచ్చిండ్రు.. మాకే ఏమీ ఇవ్వలేదని కోడళ్లు కొంచం మా మీద అలిగిండ్రు.. గెలవగానే కోడళ్లకు మంచి శుభ వార్త చెప్తాం. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కోడళ్లందరికీ నెలకు రూ.3 వేల పెన్షన్‌ ఇస్తాం. కోడళ్లకు, అత్తలకు సమానంగా ఇస్తారా అని అలగొద్దు… అత్తలకు ఇస్తున్న పింఛన్‌ను రూ.5 వేల వరకు పెంచుతాం’’ అని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘స్వతంత్ర భారత చరిత్రలో కేసీఆర్‌ను మించిన నేత లేడు. 75 ఏళ్ల చర్రితలో దేశంలో అన్నదాతల కోసం రైతుబంధు, రైతు బీమా ఇచ్చిన సీఎం, పీఎం ఎవరైనా ఉన్నారా. ఇప్పటికే మన రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛన్లు, 75 లక్షల మంది రైతులకు రైతుబంధు, 13.5 లక్షల మందికి కల్యాణలక్ష్మి, 15 లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు ఇచ్చాము. ఈ ఘనత కేసీఆర్‌ది కాదా’’ అని ప్రశ్నించారు.

అలానే ‘‘ఎలక్షన్‌లు రాగానే ఆగమాగం కావద్దు.. కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు. డిసెంబర్‌ 3న బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించిన మన ప్రభుత్వం ఏర్పాటు కాగానే భూములు లేని పేదలకు కేసీఆర్‌ బీమా అమలు చేస్తాము. అలానే తెల్లకార్డున్న వారందరికీ సన్న బియ్యం ఇస్తాం. రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తాము’’ అని తెలిపారు. అలానే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 111 జీఓను ఎత్తేశామని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు.

కాంగ్రెస్‌, బీజేపీపై విమర్శలు..

అనంతరం కాంగ్రెస్‌, బీజేపీల మీద విమర్శలు చేశారు కేటీఆర్‌. మన జుట్టు ఢిల్లీ వాని చేతికివ్వొద్దు.. ఇన్నాళ్లు పాలించింది వారే.. మళ్లీ ఒక్క చాన్స్‌ అని వస్తున్నరు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌కు 11 చాన్స్‌లు ఇచ్చాము.. అన్నేళ్లల్లో ఏమి చేయలేని హస్తం పార్టీ.. ఇప్పుడు మాత్రం ఏం చేస్తుంది అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 52కిలోల బక్క కేసీఆర్‌ను కొట్టనీకి ఢిల్లీతో పాటు పక్క రాష్ట్రాల నుంచి గుంపులుగా వస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంతమంది వచ్చినా కేసీఆర్‌ని ఏమీ చేయలేరని, తెలంగాణ బిడ్డ మన సీఎం కె.చంద్రశేఖర్‌ రావు సింహం లాంటోడని, సింహం సింగిల్‌గానే వస్తదని, గుంపులు గుంపులుగా వచ్చేటోళ్లను ఏమంటా రో మీకే తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.