iDreamPost
android-app
ios-app

కోహ్లీలానే మేము కూడా ఈసారి పక్కా సెంచరీ చేస్తాం: కేటీఆర్‌

  • Published Nov 07, 2023 | 9:41 AM Updated Updated Nov 07, 2023 | 9:41 AM

తెలంగాణలో ఎన్నికల ప్రచార జోరు పెరిగింది. ప్రతి అవకాశాన్ని, సందర్భాన్ని ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలో తాజాగా కోహ్లీ చేసిన సెంచరీని తన ప్రచారంలో ప్రస్తావిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌. ఆ వివరాలు..

తెలంగాణలో ఎన్నికల ప్రచార జోరు పెరిగింది. ప్రతి అవకాశాన్ని, సందర్భాన్ని ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలో తాజాగా కోహ్లీ చేసిన సెంచరీని తన ప్రచారంలో ప్రస్తావిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌. ఆ వివరాలు..

  • Published Nov 07, 2023 | 9:41 AMUpdated Nov 07, 2023 | 9:41 AM
కోహ్లీలానే మేము కూడా ఈసారి పక్కా సెంచరీ చేస్తాం: కేటీఆర్‌

ప్రస్తుతం దేశంలో రెండు రకాల ట్రెండ్స్‌ కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్‌ నడుస్తుండగా.. మరోవైపు వరల్డ్‌ కప్‌ జోరు కొనసాగుతోంది. ఈ సారి మన దేశంలోనే వరల్డ్‌ కప్‌ నిర్వహణ ఉండటం వల్ల ఈ క్రేజ్‌ మరింత పెరిగింది. మైదానంలో టీమిండియా విజయభేరీ మిగిస్తూ.. సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. టీమిండియా నెలకొల్పుతున్న రికార్డులపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రాజకీయ నేతలు సైతం టీమిండియాను స్ఫూర్తిగా తీసుకుని.. ఎన్నికల్లో తాము కూడా రికార్డులు క్రియేట్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్‌ కప్‌లో కోహ్లీ ఎలా అయితే సెంచరీలు చేస్తున్నాడో.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా అలానే సెంచరీ కొడతాం అని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్‌.

వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సభలో పాల్గొన్న కేటీఆర్.. ప్రచార సభలో మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌లో కోహ్లీ తన పుట్టిన రోజు నాడు రికార్డు సెంచరీ నమోదు చేసినట్టుగానే.. కేసీఆర్ కూడా తెలంగాణలో ఈసారి సెంచరీ కొడతాడని.. బీఆర్‌ఎస్‌ వంద సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలతో వస్తున్న రాహుల్ గాంధీని.. నవంబర్ 30న తెలంగాణ ప్రజలు సిక్స్ కొట్టడం ఖాయమని చెప్పుకొచ్చారు.

అలానే తెలంగాణ‌ను ఎవరూ పాలించాలనేది నిర్ణయించాల్సింది.. ఢిల్లీలో ఉండే నరేంద్ర మోదీనో.. రాహుల్‌ గాంధీనో కాదు.. తెలంగాణ గల్లీలోని జనాలు మాత్రమే అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అలానే వేముల‌వాడ‌లో పోటీ చేస్తుంది ల‌క్ష్మీన‌ర‌సింహా రావు కాదని.. కేసీఆరే అనుకోవాలని ప్రజలకు సూచించారు. లక్ష్మీ నరసింహ రావును మంచి మెజార్టీతో గెలిపించాలని… వేములవాడను తాను ద‌త్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మెజార్టీ విష‌యంలో వేములవాడ.. సిరిసిల్లతో పోటీ ప‌డాల‌న్నారు.