iDreamPost
android-app
ios-app

కేటీఆర్‌ సంచలన ప్రకటన.. హోంలోన్‌ తీసుకునేవాళ్లకి BRS బంపరాఫర్‌

  • Published Nov 25, 2023 | 10:32 AM Updated Updated Nov 25, 2023 | 10:32 AM

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. హోమ్‌ లోన్‌ తీసుకునేవారికి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఆ వివరాలు..

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. హోమ్‌ లోన్‌ తీసుకునేవారికి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఆ వివరాలు..

  • Published Nov 25, 2023 | 10:32 AMUpdated Nov 25, 2023 | 10:32 AM
కేటీఆర్‌ సంచలన ప్రకటన.. హోంలోన్‌ తీసుకునేవాళ్లకి BRS బంపరాఫర్‌

మరో ఐదు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల అనగా డిసెంబర్‌ 3న కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలన్ని ప్రచార కార్యక్రమాల జోరు పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ఆఖరి వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టో విడుదల చేశాయి అన్ని పార్టీలు. ఇక కొందరు అభ్యర్థులు వారికి వారే సొంతంగా మేనిఫెస్టో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. హ్యాట్రిక్‌ కొట్టాలని అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా కారు పార్టీ అధికార ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. ఇళ్లు కట్టుకోవాలనుకునే మధ్యతరగతి వారికి ఆయన శుభవార్త చెప్పారు. ఆ వివరాలు..

అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్‌ చెప్పారు. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఆకర్షణీయమైన పథకాలు, హామీలతో మేనిఫెస్టో ప్రకటించిన కారు పార్టీ.. మరో కొత్త పథకం గురించి కీలక ప్రకటన చేసింది. అధికారంలోకి రాగానే.. హోమ్‌లోన్‌ తీసుకునేవారికి శుభవార్త చెప్పనున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.

హెచ్‌ఐసీసీలో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌-2023లో పాల్గొన్న కేటీఆర్‌ కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నవారి కోసం సరికొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పని చేస్తుందని తెలిపారు. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదం పెట్టుకున్నామని.. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నది తమ ఉద్దేశ్యమని కేటీఆర్‌ పేర్కొన్నారు.

అయితే.. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అంటే.. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తారా అని డౌట్ రావచ్చని.. డబుల్ బెడ్ రూం ఇండ్లు, గృహలక్ష్మి రెండూ ఉంటాయని.. వాటితో పాటుగా మరో కొత్త పథకాన్ని కూడా తీసుకు వచ్చే దిశగా కేసీఆర్ ఆలోచించారని తెలిపారు కేటీఆర్‌. దీనిలో భాగంగా లోన్ తీసుకుని ఇండ్లు కొనుక్కోవాలనుకునే మిడిల్ క్లాస్ వారి కోసం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చూస్తున్నామని తెలిపారు.

ఈ పథకం ద్వారా ఆ లోన్‌‌కు సంబంధించిన ఇంట్రెస్ట్‌ను ప్రభుత్వమే కట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. దీని ద్వారా ఇళ్లు కొనాలనుకునే మధ్యతరగతి వారికి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. మరి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.