సొంత పార్టీ నేతలకు రాజా సింగ్‌ వార్నింగ్‌.. చంపేస్తానంటూ

వివాదాలకు కెరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచే రాజా సింగ్‌.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సొంత పార్టీ నేతలనే చంపుతానంటూ వార్నింగ్‌ ఇచ్చారు. కారణమేంటి అంటే..

వివాదాలకు కెరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచే రాజా సింగ్‌.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సొంత పార్టీ నేతలనే చంపుతానంటూ వార్నింగ్‌ ఇచ్చారు. కారణమేంటి అంటే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో.. పార్టీలన్ని ప్రచార స్పీడు పెంచాయి. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక పార్టీల కీలక నేతలు.. రోజుకు రెండు, మూడు చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత సున్నితమైన నియోజకవర్గాల్లో గోషామహల్ ఒకటి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్‌ విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో భాగంగా మరోసారి గోషామహల్‌ నుంచే బరిలో దిగుతున్నారు రాజా సింగ్‌.

ఇక రాజా సింగ్‌ అంటేనే వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా ఉంటారు. ఎన్నికల ముందు వరకు ఆయన మీద సస్పెన్షన్‌ వేటు వేసింది బీజేపీ పార్టీ. ఎన్నికల నేపథ్యంలో దాన్ని ఎత్తి వేసింది. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్‌. ఏకంగా సొంత పార్టీ నేతలనే చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఎన్నికల నేపథ్యంలో తాజాగా రాజా సింగ్‌.. గోషామహల్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. చంపుతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఎన్నికలని.. తనను మోసం చేస్తే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని హెచ్చరించారు. అంతేకాదు.. అవసరమైతే.. తనను మోసం చేసేవారిని చంపేందుకు కూడా వెనుకాడబోనంటూ తీవ్ర స్వరంతో సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

తన వ్యూహాలను సొంత మనుషులే తన ప్రత్యర్థులకు చేరవేస్తున్నారంటూ ఈ సందర్భంగా రాజా సింగ్‌ ఆరోపించారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాక 2018 ఎన్నికల్లో కూడా తనను ఓడించటానికి ప్రయత్నించారని.. వారి లిస్ట్ తన వద్ద ఉందన్నారు రాజాసింగ్.

ప్రస్తుతం ఎవరెవరు తన ప్రత్యర్థులతో టచ్‌లో ఉన్నారో కూడా తనకు తెలుసునని, వారి సంగతి తరువాత చూసుకుంటానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్. తాజా ఎన్నికల్లో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని.. ధర్మాన్ని గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజా సింగ్‌ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఎన్నికల వేళ సొంత పార్టీ నేతలకు ఇలా వార్నింగ్‌ ఇవ్వడం ఏంటంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. తన నియోజకవర్గంలో రిగ్గింగ్‌ జరగకుండా చూడాలంటూ రాజా సింగ్‌ ఈసీకి ఫిర్యాదు చేస్తే.. మరోవైపు ఆయనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎన్నికల ప్రచారంలో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశారు. ముస్లిం యువతులను సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేయాలంటూ హిందువులను రాజాసింగ్ రెచ్చగొడుతున్నారంటూ ఓ వీడియోను ఆధారంగా చూపిస్తున్నారు. కొంత కాలం క్రితం బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యి.. మళ్లీ గోషామహల్‌ టికెట్‌ దక్కించుకున్నారు రాజాసింగ్. ఇక ఆయనను ఓడించడానికి బీఆర్‌ఎస్‌ నంద కిషోర్‌ వ్యాస్‌ బిలాల్‌ను బరిలోకి దించగా, కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా మొగిలి సునీతరావు ముధిరాజ్‌ను ప్రతిపాదించింది.

Show comments