iDreamPost
android-app
ios-app

బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అయ్యేది అతనే’

  • Published Nov 08, 2023 | 2:10 PM Updated Updated Nov 08, 2023 | 2:12 PM

తెలంగాణలో ఒకవేళ బీజేపీ అదికారంలోకి వస్తే.. సీఎం క్యాండెట్‌ ఎవరనే దాని గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్‌ సీఎం క్యాండెట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో ఒకవేళ బీజేపీ అదికారంలోకి వస్తే.. సీఎం క్యాండెట్‌ ఎవరనే దాని గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్‌ సీఎం క్యాండెట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Nov 08, 2023 | 2:10 PMUpdated Nov 08, 2023 | 2:12 PM
బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అయ్యేది అతనే’

తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుంది. మరో 22 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక గెలుపే లక్ష్యంగా పార్టీలన్ని ముందుకు సాగుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన, ప్రచార కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాయి. మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్‌ఎస్‌ గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కారుకు బ్రేక్‌ వేసి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అలానే కమలం పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే కమలం పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా వంటి అగ్ర నేతలు రాష్ట్రానికి వచ్చి ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ఈ క్రమంలో బీజేపీ కీలక నేత బండి సంజయ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఇంకా పూర్తి కాలేదు. అలానే సీఎం క్యాండెట్‌ ఎవరనేది కూడా తెలియలేదు. కాకపోతే అధిఫ్టానం ఇచ్చిన హింట్‌తో.. బీజేపీ గెలిస్తే.. సీఎం అయ్యేది ఫలానా వారే అనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకు ఏంటా హింట్‌ అంటే.. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కొన్ని రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. అంతేకాక మంగళవారం ఎల్‌బీ ప్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ కూడా అదే ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ ‍క్యాండెట్‌ని సీఎం చేస్తామని ప్రకటించారు. దాంతో తెలంగాణలో బీజేపీ సీఎం క్యాండేట్‌ ఎవరనే దాని గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఆ ఇద్దరి వైపే అందరి చూపు..

దీనిలో భాగాంగా ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారు ఎంపీ బండి సంజయ్‌తో, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్ ఆర్ఎస్‌ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి. బీజేపీలో కింది స్థాయి నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడు. ఇక ఈటల రాజేందర్ కూడా కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు. కాకపోతే ఆయన కొన్ని రోజుల క్రితమే బీజేపీలో చేరారు. ఇక రాజేందర్‌ విషయానికి వస్తే.. సుమారు 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం ఆయనకు కలిసి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఈ క్రమంలో తాజాగా నేడు అనగా బుధవారం బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఆస​క్తికరంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల్లోని పేద వ్యక్తి సీఎం చేస్తారని చెప్పుకొచ్చారు. బండి సంజయ్‌ వ్యాఖ్యల ప్రకారం చూసుకుంటే.. ఈటలకు సీఎం అయ్యే అవకాశం లేనట్లే. ఎందుకంటే ఈటల రాజేందర్ బీసీ అయినా.. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నారు. ఆయనకు ఫౌల్ట్రీ వ్యాపారులు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ రూ.53.94 కోట్లు ఉంది.

సీఎం క్యాండెట్‌ ఆయనే..

అదే బండి సంజయ్‌ విషయానికి వస్తే.. తనకు సొంతిల్లు కూడా లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కారు కూడా ఈఎంఐలతో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈటలతో పోలిస్తే.. ఆస్తులు కూడా పెద్దగా లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే బండి సంజయ్‌ అలాంటి కామెంట్‌ చేశారని.. అంటే సీఎం క్యాండెట్‌ తనే అని చెప్పకనే చెప్పారని అంటున్నారు రాజకీయ పండితులు. అంతేకాక బీజేపీ గెలిస్తే.. ఈటల, బండి సంజయ్‌.. వీరిద్దరిలో ఎవరో ఒకరు సీఎం అవుతారని అభిప్రాయపడుతున్నారు. ఇక వీరి వరస ఇలా ఉంటే.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మాత్రం.. ముందు మీరు గెలవండి.. ఆ తర్వాత సీఎం క్యాండెట్‌ గురించి మాట్లాడుకోవచ్చు అని కామెంట్స్‌ చేస్తున్నారు.