iDreamPost
android-app
ios-app

అమిత్‌ షా ప్రకటనపై ఆసక్తికర చర్చ.. BJP గెలిస్తే ఈటల రాజేందర్‌ CM?

  • Published Oct 28, 2023 | 2:57 PM Updated Updated Oct 28, 2023 | 2:57 PM

సూర్యపేట ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌ హాట్‌గా చర్చ సాగుతోంది. ఇక అన్ని అనుకూలిస్తే.. ఈటల రాజేందర్‌ సీఎం అవుతాడనే ప్రచారం మొదలయ్యింది. మరి దీని వెనక కారణం ఏంటి అంటే..

సూర్యపేట ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌ హాట్‌గా చర్చ సాగుతోంది. ఇక అన్ని అనుకూలిస్తే.. ఈటల రాజేందర్‌ సీఎం అవుతాడనే ప్రచారం మొదలయ్యింది. మరి దీని వెనక కారణం ఏంటి అంటే..

  • Published Oct 28, 2023 | 2:57 PMUpdated Oct 28, 2023 | 2:57 PM
అమిత్‌ షా ప్రకటనపై ఆసక్తికర చర్చ.. BJP గెలిస్తే ఈటల రాజేందర్‌ CM?

తెలంగాణలో ఎన్నికల సమరం ప్రారంభమయ్యింది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల, ప్రచార కార్యక్రమాలతో పార్టీలన్ని ఫుల్‌ బిజీగా ఉన్నాయి. ఇక తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ కాస్త వెనబకబడిందనే చెప్పవచ్చు. పొత్తులు, అభ్యర్థుల ప్రకటన ఇంకా పూర్తి కాలేదు. కాకపోతే ప్రచార కార్యక్రమాలు మాత్రం ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. ఈటల రాజేందర్‌ సీఎం అవుతారనే టాక్‌ వినిపిస్తోంది. ఆ వివరాలు..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి చేస్తామని సూర్యాపేటలో నిర్వహించిన ప్రజా గర్జన సభలో అమిత్ షా ప్రకటించారు. అంతేకాక బీజేపీ పేదల పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా కుటుంబ పార్టీలేనని అమిత్‌ షా విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం.. అటు రాహుల్ గాంధీని పీఎం చేయటమే సోనియా గాంధీ జీవిత ధ్యేయమని చెప్పుకొచ్చారు అమిత్‌ షా.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు బీసీల సంక్షేమం ఏమాత్రం పట్టదని ఆరోపించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని.. మరి బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు అమిత్‌ షా.

సీఎం అభ్యర్థిగా ఈటల..?

అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అంతేకాక బీజేపీ సీఎం క్యాండెట్‌ ఎవరనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న కీలక నేతల్లో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్, డా. కే. లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ వంటి బీసీ నేతల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే వీరిలో లక్ష్మణ్‌కు రాజ్యసభ పదవి ఇవ్వగా.. ఇక మిగిలిన వారు సీఎం రేసులో ఉంటారన్నమాట.

ఇక ఈ ముగ్గురిలో బండి సంజయ్, ఈటల రాజేందర్‌ ఇద్దరికీ మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నాయి. అయితే సీఎం పదవి దగ్గరకు వచ్చే సరికే ఈటలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ పండితులు. పైగా ఈటల రాజేందర్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది. బీఆర్ఎస్‌లో ఒకానొక సమయంలో సీఎం కేసీఆర్ తర్వాత స్థానం ఈటలదే అన్న వాదన కూడా తెర మీదకు వచ్చింది అంటున్నారు.

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని.. బీజేపీ గెలిస్తే.. ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటున్నారు ఆయన అభిమానులు. ఈటలతో పోలిస్తే.. మిగతా నేతలు బీజేపీలో సీనియర్లు అయినప్పటికీ.. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అనుభవం వారికి లేదు. ఈటలకు ఇది అదనపు క్వాలిఫికేషన్‌ అవుతుంది. కాబట్టి.. అమిత్ షా ప్రకటన ప్రకారం చూస్తే.. ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం ఈటల రాజేందరే ముఖ్యమంత్రి అని అర్థం అవుతోంది అంటున్నారు. ఒకవేళ నిజంగానే తెలంగాణలో బీజేపీ గెలిస్తే ఈటలను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా.. ప్రకటించినా బీజేపీ సీనియర్ నేతలు మద్దతు తెలుపుతారా అనేది అనుమానామే అంటున్నారు రాజకీయ పండితులు.