iDreamPost
android-app
ios-app

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు: రేవంత్ ఇంటికి DGP.. భద్రత పెంపు

  • Published Dec 03, 2023 | 1:17 PM Updated Updated Dec 03, 2023 | 1:17 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. 69 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ డీజీపీ రేవంత్ ఇంటికి వెళ్లడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. 69 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ డీజీపీ రేవంత్ ఇంటికి వెళ్లడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

  • Published Dec 03, 2023 | 1:17 PMUpdated Dec 03, 2023 | 1:17 PM
Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు: రేవంత్ ఇంటికి DGP.. భద్రత పెంపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో.. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని కార్యకర్తలు, నేతలు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు ప్రారంభించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. భారీ ర్యాలీగా.. గాంధీ భవన్ కు బయలుదేరి వెళ్లారు. డీకే శివకుమార్ కూడా గాంధీ భవన్ కు చేరుకున్నారు.

ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక రేవంత్ ను కలిసిన వారిలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ విజయం నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ప్రశంసించినట్లు తెలుస్తోంది. అంతేకాక రేవంత్ రెడ్డికి భద్రత కూడా పెంచారు. మరోవైపు కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో.. భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు రేవంత్ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. సంబరాలు చేసుకుని.. మిఠాయిలు పంచుకుంటున్నారు.

అలానే కొడంగల్‌లో రేవంత్ రెడ్డి స్వగ్రామంలోని నివాసం వద్దకు స్పెషల్ ఫోర్స్ పోలీసులు, సీఆర్ఎఫ్ బలగాలు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. హైదరాబాద్‌లో రేవంత్ నివాసం భద్రతను సీఆర్ఎఫ్ బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. రేవంత్ రెడ్డి సోదరుడు కొండారెడ్డికి కూడా పోలీసుల ప్రత్యేక భద్రత కల్పించారు. రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డారు. ముందుండి నడిపించారు. కొడంగల్‌తో పాటు కామారెడ్డిలోనూ గెలుస్తున్నాడు. ఆయనే సీఎం అవుతాడని పార్టీ సీనియర్ నేత వీహెచ్ అన్నారు.