Dharani
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరి రేసులో ఎవరెవరు ఉన్నారంటే..
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరి రేసులో ఎవరెవరు ఉన్నారంటే..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 28 చోట్ల విజయం సాధించగా.. మరో 36 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుగుణంగానే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు కన్ఫామ్ అయిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి భారీ ర్యాలీతో గాంధీ భవన్ కు తరలి వెళ్లారు.
తెలంగాణలో అధికారం హస్తగతమైనట్లే. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరు.. అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది అనే దాని మీద జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే మెజారిటీ వర్గాలు మాత్రం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే సీఎం అని ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో జానా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులంతా.. తాము కూడా సీఎం రేసులో ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి పదవి చేపడతామని మనసులో మాట బయట పెట్టారు.
ఇక ఆదివారం నాడు తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతున్న వేళ.. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తాను అంటూ.. మనసులోని కోరికను బయట పెట్టారు. సీనియారిటీ, దళిత కార్డు, ఉపయోగించుకుని.. ముఖ్యమంత్రి కావాలని భట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా నేడు కాంగ్రెస్ విజయంలో ఆయన పాదయాత్ర కూడా కీలక పాత్ర పోషించిందనే విషయాన్ని మర్చిపోకూడదు అంటున్నారు ఆయన అభిమానులు. ఇక గతంలో రేవంత్ రెడ్డి తానా సభల్లో మాట్లాడుతూ.. ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంగా చేస్తామని తెలిపారు.
అలానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానా రెడ్డి వంటి సీనియర్ నేతలు తాము కూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నామని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 65-70 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో.. సీఎం క్యాండెట్ సెలక్షన్ విషయంలో.. అధిష్టానం సామాజిక వర్గం ప్రతిపాదికన ముందుకు వెళ్తుందని.. రెడ్డి నేతనే సీఎం క్యాండెట్ గా సెలక్ట్ చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారికి కాకుండా ఇతర సామాజిక వర్గాల వారికి అవకాశం కల్పిస్తే.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు వేరు కుంపటి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అధిష్టానం ఈ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటే.. రేవంత్ రెడ్డినే సీఎం క్యాండెట్ గా సెలక్ట్ చేస్తుందని అంటున్నారు రాజకీయ పండితులు.
పైగా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అందరని కలుపుకు పోతూ.. పార్టీ బలోపేతం కోసం పాటు పడ్డారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. వాటికి భయపడకుండా.. సీనియర్లను కలుపుకుంటూ ముందుకు సాగారు. ఇక ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నుంచి.. బీఆర్ఎస్ పార్టీ మీద దూకుడుగా విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
ఇక ఎన్నికల వేళ కూడా నేతలంతా తమ నియోజకవర్గాలకే పరిమితం అయితే రేవంత్ మాత్రం.. రాష్ట్రం అంతా పర్యటిస్తూ.. ప్రచారం నిర్వహించారు. కనుకు రేవంత్ నే సీఎం చేస్తారని అంటున్నారు రాజకీయ పండితులు. మరి కాంగ్రెస్ తరఫున సీఎం క్యాండెట్ ఎవరో తెలియాంటే.. మరి కొన్ని రోజులు ఎదురు చూడాలి. మరి కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు భావిస్తున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.