Revanth Reddy: వారిని తలచుకుంటూ CM రేవంత్ భావోద్వేగ లేఖ.. ‘నా గుండెల్లో మీ స్థానం పదిలం’

తెలంగాఖ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ప్రజలను ఉద్దేశిస్తూ రాసిన భావోద్వేగా లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

తెలంగాఖ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ప్రజలను ఉద్దేశిస్తూ రాసిన భావోద్వేగా లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెకస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నుంచి.. కొడంగల్ నుంచి.. ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే గత లోక్ సభ ఎన్నికల్లో.. రేవంత్ మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ప్రస్తుతం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో.. మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. లోక్‌సభ స్పీకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు రేవంత్. ప్రస్తుతం అంది నెట్టింట వైరల్ గా మారింది.

తనను దేశానికి పరిచయం చేసింది మల్కాజిగిరి ప్రజలేనని లేఖలో చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు మల్కాజిగిరికి కూడా ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తనను ఎంపీగా గెలిపించిన మల్కాజిగిరి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి. మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటానని తన లేఖలో పేర్కొన్నారు. “ఏ విశ్వాసంతో, ఏ అభిమానంతో నన్ను గెలిపించారో ఐదేళ్లు మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశాను. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్ని సార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో నా పరిస్థితిని మీరు సహృదయంతో అర్థం చేసుకున్నారు” అని తెలిపాడు.

 

“తల్లి తన బిడ్డను దేశ రక్షణ కోసం పంపినట్టు, నన్ను మీరు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారు. ఇన్నాళ్లు ఆ బాధ్యతను త్రికరణశుద్ధిగా నిర్వర్తించానని భావిస్తున్నాను. మల్కాజిగిరి ప్రజలందరికి పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు. ఐదేళ్లే కాదు ఇక మీతో నా అనుబంధం.. నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. మల్కాజిగిరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాడు మీరు పోసిన ఊపిరి.. నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది” అంటూ రేవంత్ రెడ్డి తన లేఖలో రాసుకొచ్చారు.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. కాగా.. అధిష్ఠానం.. ఆయనను సీఎల్పీ నేతగా ఎన్నుకోవటంతో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో.. తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.

Show comments