Dharani
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణ హీటెక్కుతుంది. పార్టీలన్ని గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక ఎన్నికల నేపథ్యంలో అనేక సంస్థలు సర్వే రిపోర్ట్స్‌ని విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా ఆత్మసాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. ఆ వివరాలు..
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణ హీటెక్కుతుంది. పార్టీలన్ని గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక ఎన్నికల నేపథ్యంలో అనేక సంస్థలు సర్వే రిపోర్ట్స్‌ని విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా ఆత్మసాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరో నెల రోజుల్లో నేతలు, పార్టీల భవితవ్యం బయటపడనుంది. మరోసారి విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టాలని కారు పార్టీ బలంగా డిసైడ్ అవ్వగా.. ఆ స్పీడుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడమే కాక.. మేనిఫెస్టో విడుదల చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు తాము చేపట్టిన సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఎన్నికలపై శ్రీ ఆత్మ సాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. ఆ వివరాలు..
తెలంగాణ ఎన్నికలపై శ్రీఆత్మ సాక్షి సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి 64-70 సీట్లు వస్తాయని అంచానా వేసింది. గతంతో పోలిస్తే.. అనగా 2018తో పోల్చితే ఈ సారి బీఆర్‌ఎస్ ఓట్ షేర్ తగ్గుతుందని తెలిపింది. 2018లో బీఆర్‌ఎస్ పార్టీకి 46.8 శాతం ఓట్లు రాగా.. ఈసారి 4 శాతం ఓట్లు తగ్గుతాయని.. 2023 ఎన్నికల్లో ఆ పార్టీకి 42.5 శాతం ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ 37-43 సీట్లు సాధించే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. అయితే గతంతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ గణనీయంగా పెరగనుందని ఈ సర్వే వెల్లడించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 శాతం ఓట్ షేర్ సాధిస్తే ఈసారి ఆ మొత్తం 36 శాతానికి పెరగనున్నట్లు సర్వే చెబుతోంది. ఓట్ షేర్ పెరిగినా.. కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాలేదని స్పష్టం చేసింది.
ఇక గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ అనుహ్యంగా పుంజుకుంటుందని ఆత్మసాక్షి సర్వే తెలిపింది. కమలం పార్టీకి 2018లో ఒక సీటు మాత్రమే రాగా.. ఈసారి 5-6 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. గతంలో బీజేపీకి 6.98 శాతం ఓట్లు రాగా.. ఈసారి 10.75 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే చెప్పుకొచ్చింది. ఇక ఎంఐఎం ఎప్పటిలాగే 6-7 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాల్లో హోరాహోరీ వుండనుందని… ఇందులో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 2, బీజేపీ 1 చోట ఆధిక్యం సాధించవచ్చని సర్వే అంచాన వేసింది. మొత్తంగా చూసుకుంటూ.. ఓట్ షేర్ తగ్గినా.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీదే విజయమని శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకటించింది. ఇక గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉపఎన్నికలు, ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము వెల్లడించిన సర్వే ఫలితాలు నిజమయ్యాయని శ్రీ ఆత్మసాక్షి సంస్థ పేర్కొంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై శ్రీ ఆత్మ సాక్షి సర్వే విడుదల
సీట్ల వారీగా
బీఆర్ఎస్ : 64-70
కాంగ్రెస్ : 37-43
బీజేపీ : 5-6
ఏంఐఎం : 6-7
గట్టి పోటీ ఉన్నవి : 6ఓట్ షేర్ వారీగా
బీఆర్ఎస్ : 42.5%
కాంగ్రెస్ : 36.5%
బీజేపీ : 10.75%
ఏంఐఎం : 2.75%
ఇతరులు : 7.5%గతంలో దుబ్బాక, హుజురాబాద్,… pic.twitter.com/32wYfU7YNP
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2023