Dharani
ఎన్నికల ప్రచార సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలపై జనాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. రేవంత్ తెలంగాణ ప్రజలందరని అవమానించారని విమర్శిస్తున్నారు. ఆ వివరాలు..
ఎన్నికల ప్రచార సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలపై జనాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. రేవంత్ తెలంగాణ ప్రజలందరని అవమానించారని విమర్శిస్తున్నారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ చివరి నాటికి పోలింగ్ ముగుస్తుంది. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు వెలువడతాయి. ఇక పార్టీలన్ని గెలుపు కోసం వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలు రెడీ చేస్తున్నాయి. ఇక ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు దూసుకెళ్తుంది. ఆరు గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. తెలంగాణలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారు జనాలు.
ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. బిర్లా మందిర్, నాంపల్లి దర్గా దగ్గర మీరు బిచ్చం ఎత్తుకుని బతికే వాళ్లు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేసింది కేటీఆర్‌ను ఉద్దేశించి. పెద్దపల్లిలో జరిగిన ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరగిందని.. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీ కళ్లకు కనిపిచండం లేదా అని రాహుల్‌ని ప్రశ్నించారు కేటీఆర్.
ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కేటీఆర్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ.. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. బిర్లా మందిర్, నాంపల్లి దర్గా దగ్గర మీరు బిచ్చం ఎత్తుకుని బతికే వాళ్లు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జనాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఏమైనా కాంగ్రెస్ పార్టీ సొత్తా.. వాళ్లు ఏదో దయ తలిచి ఇవ్వడానికి.. దశబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసి.. ఎన్నో బలిదానాలు చేసి.. పోరాడి సాధించున్న తెలంగాణ ఇది. సోనియా గాంధీ రాక్షసత్వం గురించి ఉస్మానియా పాత విద్యార్థులను అడుగు తెలుస్తుంది.. ఎందరి ప్రాణాలు బలి తీసుకుందో అంటూ రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు జనాలు. పాపం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇద్దామనుకుంటే.. తిరిగి ఆయనకే రివర్స్ అయ్యింది అంటున్నారు విశ్లేషకులు.
సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిర్లా మందిర్ దగ్గర, నాంపల్లి దర్గా దగ్గర మీరు బిచ్చం ఎత్తుకుని బతికే వాళ్ళు – రేవంత్ రెడ్డి pic.twitter.com/GCGtE2EkEQ
— Telugu Scribe (@TeluguScribe) October 19, 2023