iDreamPost
android-app
ios-app

Krishnam Raju: రాజకీయాల్లోకి కృష్ణంరాజు భార్య.. YSRCP ఎంపీ అభ్యర్థిగా పోటీ?

Krishnam Raju: రాజకీయాల్లోకి కృష్ణంరాజు భార్య.. YSRCP ఎంపీ అభ్యర్థిగా పోటీ?

చిత్రపరిశ్రమకు, రాజకీయ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకు ఉదాహరణగా ఎన్నో  చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. సినిమాల్లో రాణించిన ప్రతి వ్యక్తి కూడా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని  పరీక్షించుకున్నారు. ఇలా వచ్చిన సినీ ప్రముఖల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, ఇతర నటీనటులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి చట్ట సభల్లో అడుగు పెట్టారు. ప్రస్తుతం కూడా పలువురు సినీ ప్రముఖులు రాజకీయ్లాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.  ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

రెబల్ స్టార్ కృష్ణం రాజు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ధృవతార. తనదైన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా బిరుదు పొందారు. ఇలా చిత్ర పరిశ్రమలోనే కాక రాజకీయాల్లో కూడా ఆయన ఎంట్రీ ఇచ్చారు. రాజు గారికి రాజకీయ రంగం తో చాలా సనిహిత సంబందం ఉంది. గతంలో ఎంపీగా పోటీ చేసి కృష్ణం రాజు గెలుపొందారు. కొంతకాలం క్రితం ఆయన కన్నుమూసిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన భార్య అయిన శ్యామల దేవి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు గా టాక్ వినిపిస్తోంది. అది కూడా  ప్రస్తుతం  అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ తరపు నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఈమె బరిలో దిగనున్నారంట. ప్రస్తుతం ఈ స్థానంలో వైసీపీ పార్టీ తరపున రఘురామ  కృష్ణం రాజు పోటీ చేసి గెలిచారు. అయితే పార్టీతో వచ్చిన అంతర్గత విబేధాల కారణంగా ఆయన చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నార. అంతేకా వైసీపీ రెబల్ ఎంపీగా పేరు తెచ్చుకున్నాయన  సీఎం జగన్ తో పాటు , వైసీపీ పార్టీ వైఖరిని కూడా తప్పుపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్న రఘురామకు ధీటుగా నర్సాపురం లోకసభ స్థానంలో కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న అధికార పార్టీకి ఆ ప్రయత్నాలు ఫలించినట్టు కనిపిస్తోంది.

ఎందుకంటే దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి గారిని పోటీ చేసించే అవకాశాలు కనిపిస్తున్నయి. అయితే ఈ వార్తలపై ఇటు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి గారి నుంచి కానీ, అధికార పార్టీ నుంచి కానీ ఎలాంటి స్పందన  రాలేదు. ఏది ఏమైనప్పటికి ప్రభాస్ కుటుంబం మరోసారి రాజకీయాల్లోకి వస్తుందనే వార్తలపై వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ప్రభాస్ పెద్దమ్మ వైసీపీ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.