జగన్ బలం పెరిగిందా? ఈసారి ఇంకా గట్టిగా కొట్టేలా ఉన్నాడే!

జగన్ బలం పెరిగిందా? ఈసారి ఇంకా గట్టిగా కొట్టేలా ఉన్నాడే!

సంక్షేమం అంటే.. మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. ప్రజలందరూ అభివృద్ధి చెందాలి అని కోరుకుంటే సరిపోదు.. దాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. వాటిని ఎలాంటి పక్షపాతం చూపకుండా.. అవినీతికి తావు లేకుండా.. లబ్ధిదారులందరికి చేరేలా చూడాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే సంక్షేమ ఫలాలు అందరకి సమానంగా చేరి.. అభివృద్ధి జరుగుతుంది. అలాంటి చర్యలు తీసుకున్న నేతలను ప్రజలు ఎన్నటికి మర్చిపోరు. వారి గుండెల్లో పెట్టుకుంటారు. తాజాగా ఆంధ్రపదేశ్‌లో ఇదే పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ.. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

రాష్ట్రంలోని ప్రతి గడపకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు సీఎం జగన్‌. గతంలో ఎన్నడు లేని విధంగా.. ప్రభుత్వ పథకాల ఫలితాలన్ని ఇంటి గడప వద్దకే వస్తున్నాయి. గర్భిణులు మొదలు.. కాటికి కాళ్లు చాపుకున్న వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు జగన్‌. వైఎస్సార్‌ ఆసరా ఫించన్లు, చదువుకునే పిల్లల కోసం అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్దు, విదేశీ విద్యా దివేన వంటి పథకాలతో పాటు.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా అభివృద్ధి చేయడం కోసం నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలానే కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం సేవలు అందించాడానికి ఆరోగ్య శ్రీని అమలు చేస్తున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందడం కోసం వారికి వివిధ పథకాల ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు జగన్‌.

ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేలా పలు సంక్షేమ పథకాలతో జగన్.. జనం గుండెల్లోకి వెళ్ళిపోయాడు. జగన్‌ ఉంటేనే తమకు సంక్షేమ పాలన అందుతుందని ఏపీ జనాలు బలంగా నమ్ముతున్నారు. అందుకే మరోసారి జగన్‌కే తమ ఓటు అంటున్నారు. ఇక తాజాగా వెళ్లడైన టైమ్స్‌ నౌ సర్వే ఇదే విషయాన్ని వెల్లడించింది. సంక్షేమం అంటే జగనే అన్న రీతిలో ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు.. రానున్న ఎన్నికల్లో జగన్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తారు అని సర్వే వెల్లడించింది. ఇక ఈ ఫలితాలు అన్ని చూస్తే.. రానున్న ఎన్నికల్లో.. జగన్‌ అనుకున్నట్టే.. 175 స్థానాల్లో విజయం సాధిస్తాడని ప్రతి ఒక్కరు బలంగా విశ్వసిస్తున్నారు.

సర్వేలన్ని జగన్‌పై జనాలకు ఉన్న నమ్మకాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రజాభిమానం, సర్వే ఫలితాలు ప్రజలకు మింగుడు పడటం లేదు. జగన్‌ను ఎలా ఎదుర్కొవాలో తెలియక.. అసందర్భ ప్రేలాపనలు, పసలేని విమర్శలు చేస్తూ.. తమ స్థాయిని మరింత దిగజార్చుకుంటున్నారు. ఇక ప్రతి పక్షాల సంగతి తెలా ఉన్నా.. ఈసారి కచ్చితంగా అసెంబ్లీ, లోక్ సభలో వైసీపీ స్థానాలు పెరుగుతాయి అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి జగన్‌ ఇంకా గట్టిగా కొడతాడు అంటున్నారు.

Show comments