iDreamPost
android-app
ios-app

పొంగులేటి ఇంట్లో సోదాలకు మూల కారణం ఏంటి? ED విచారణలో ఏం తెలిసిందంటే?

  • Published Sep 27, 2024 | 5:02 PM Updated Updated Sep 27, 2024 | 5:02 PM

Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ED అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు సంచలనం రేపుతున్నాయి.

Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ED అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు సంచలనం రేపుతున్నాయి.

పొంగులేటి ఇంట్లో సోదాలకు మూల కారణం ఏంటి? ED విచారణలో ఏం తెలిసిందంటే?

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. శుక్రవారం నుంచి ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. అంతేగాక హిమాయత్‌సాగర్‌లోని పొంగులేటి ఫాంహౌస్, ఆయన కూతురు, బంధువుల ఇళ్లని కూడా వదిలిపెట్టలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ టీం ఒకేసారి 15 చోట్ల చెక్ చేస్తుంది. కస్టమ్స్ సుంకం ఎగవేత, మనీ లాండరింగ్ కేసుల్లో భాగంగా ఈడీ ఇలా సోదాలు చేస్తుంది. ఇంకా షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, రాఘవా కన్స్ట్రక్షన్స్ మధ్య సంబంధాలపై కూడా ఈడీ విచారణ చేస్తుంది. అలాగే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుండి తీసుకున్న ఫేక్ గ్యారెంటీలపై కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారని సమాచారం తెలిసింది.

గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈడీ అధికారులు పొంగులేటికి షాక్ ఇచ్చారు. ఆయన ఇంటిలో సోదాలు చేశారు. మళ్లీ అదే సీన్ ఇప్పుడు రిపీట్ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్ గా వాచీల స్మగ్లింగ్‌ కేసులో పొంగులేటి కొడుకు హర్ష రెడ్డి ఇంటిని కూడా కస్టమ్స్ అధికారులు చెక్ చేశారు. ఇక తాజాగా ఈడీ అధికారులు నుంచి ముఖ్యమైన సమాచారం ఒకటి తెలిసింది. హర్ష రెడ్డి.. క్రిప్టో, హవాలా ద్వారా ఏకంగా రూ.5 కోట్లు విలువ చేసే వాచ్‌లు కొన్నట్లు తెలిసింది. నవిన్‌ కుమార్‌ అనే వ్యక్తి ద్వారా రూ.100 కోట్లకు పైగా స్మగ్లింగ్‌ జరుగుతోందని తెలిసింది.

ఇంతకీ ఈ కేసు విషయానికి వస్తే.. గత ఫిబ్రవరి 5న చెన్నై ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు రెండు కాస్ట్లీ వాచీలను పట్టుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్‌ ఫహెర్దీన్‌ ముబీన్‌ అనే వ్యక్తి హాంకాంగ్‌ నుంచి సింగపూర్‌ మీదుగా ఇండియాలోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ వాచీలను తీసుకువచ్చిన ముబీన్‌ను అరెస్టు చేశారు. అతన్ని విచారించగా నవీన్ కుమార్ కోసం తీసుకువచ్చినట్లు చెప్పాడు. ఇక నవీన్ కుమార్‌ను విచారించగా అప్పుడు అసలు బాగోతం బయటపడింది. విచారణలో అతను హర్ష రెడ్డి పేరు చెప్పాడు. దీంతో అసలు సంగతి తెలిసింది. ఈ నిజం వెలుగులోకి వచ్చింది. విచారణలో హవాలా నుంచి ఈ వాచీలకు డబ్బులు చెల్లించినట్లు కస్టమ్స్ టీం తెలిపింది. దీంతో గతంలో కూడా ఈడీ అధికారులు సోదాలు జరిపారు. మరి దీని గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.