Dharani
టీడీపీ, జనసేన ఉమ్మడి ర్యాలీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నాందెడ్ల మనోహర్‌పై దాడి చేశారు. ఆ వివరాలు..
టీడీపీ, జనసేన ఉమ్మడి ర్యాలీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నాందెడ్ల మనోహర్‌పై దాడి చేశారు. ఆ వివరాలు..
Dharani
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని.. టీడీపీ, జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టకున్నాయి. కొన్ని రోజుల క్రితమే అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై ఆ పార్టీ నేతలతో పాటు కేడర్ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంది. పైగా పొత్తు ప్రకటన వెలువడిన నాటి నుంచి రెండు పార్టీల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. ఎప్పటికప్పుడు.. ఎక్కడికక్కడ ఇరు పార్టీ మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా టీడీపీ, జనసేన ఉమ్మడి ర్యాలీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్‌తో దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలు..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ జనసేన తరఫున తెనాలి నుంచి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్ర తెనాలిలో జనచైతన్య యాత్ర ప్రారంభించారు. బోసురోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంబమైన యాత్ర.. వీనస్ టాకిస్ దగ్గరకు చేరుకుంది. అక్కడకు వచ్చాక టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజా అక్కడికి వచ్చి కలిశారు.
రాజా రావడంతో.. ఆయనకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అందుకు పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ జిందాబాద్ అంటూ నినాదాలు ప్రారంభించారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తోపులాటలో ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఇరుక్కుపోయారు. అదే సమయంలో ఎవరో నాదెండ్ల మనోహర్ మీదకు నీళ్ల బాటిల్‌ను బలంగా విసిరారు. ఆయన తప్పుకోవాలని ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. నీళ్ల బాటిల్ ఆయన తలకు తగిలింది. ఈ ఘటనతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆలపాటి రాజా వర్గమే ఈ దాడి చేసిందని.. జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్ ఆశించిన సంగతి తెలిసిందే. అయితే పొత్తులో భాగంగా.. ఆ టికెట్‌ను జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు. అప్పటి న ఉంచి ఆలపాటి రాజా, ఆయన అనుచరులు అసంతృప్తిత ఉన్నారు. ఈ కారణంగానే.. నాదెండ్ల మనోహర్ మీద దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో యాత్రకు వచ్చిన వచ్చిన వారు అది పూర్తి కాకుండానే తిరిగి వెళ్లిపోయారు.
తెనాలి MLA అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పై water బాటిల్ తో దాడి చేసిన టీడీపీ కార్యకర్త 🤣🤣 pic.twitter.com/MlC0Kn7MV6
— MBYSJTrends ™ (@MBYSJTrends) March 7, 2024