iDreamPost
android-app
ios-app

తెలంగాణ మంత్రుల జాబితా విడుదల.. ఎవరికి చోటు దక్కిందంటే..

  • Published Dec 07, 2023 | 10:45 AM Updated Updated Dec 07, 2023 | 12:07 PM

తెలంగాణలో కొత్త గవర్నమెంట్ కొలువు దీరబోతుంది. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు, ఒకరు డిప్యూటీ సీఎంగా డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు బాధ్యతలు స్వీకరించే మంత్రుల జాబితా ఇదే..

తెలంగాణలో కొత్త గవర్నమెంట్ కొలువు దీరబోతుంది. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు, ఒకరు డిప్యూటీ సీఎంగా డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు బాధ్యతలు స్వీకరించే మంత్రుల జాబితా ఇదే..

  • Published Dec 07, 2023 | 10:45 AMUpdated Dec 07, 2023 | 12:07 PM
తెలంగాణ మంత్రుల జాబితా విడుదల.. ఎవరికి చోటు దక్కిందంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి డిసెంబర్ 7 అనగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకరానికి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన నేతలు కూడా హాజరవుతున్నారు. వీరితో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా అమరవీరుల కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ ఉద్యమ కారులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణ కేబినెట్ లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను రాజ్ భవన్ కు అందించారు రేవంత్ రెడ్డి. 11 మంది నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భట్టి విక్రమార్కను డిప్యూటి సీఎంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు కేటాయించడం గమనార్హం. వీరంతా నేడు రేవంత్ తో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరికి ఏ మంత్రి పదవి కేటాయించారు అనేది మరి కొన్ని గంటల్లో తెలనుంది.